నెగ్గుకు రావడం ఎలా….?

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వాస్తవాలు నేటికీ అర్థం కానట్లుంది. పార్లమెంటు ఎన్నికల్లో జరిగన పరాభావం ఇంకా గుర్తుకు రానట్లుంది. అయినా [more]

Update: 2019-07-12 18:29 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వాస్తవాలు నేటికీ అర్థం కానట్లుంది. పార్లమెంటు ఎన్నికల్లో జరిగన పరాభావం ఇంకా గుర్తుకు రానట్లుంది. అయినా కేజ్రీవాల్ ఇంకా ఒంటరిగా పోటీ చేసేందుకే ఇష్టపడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లకు భారీగా గండిపడింది. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. దీనిపై అథ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వచ్చే ఏడాదిలో….

వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు పర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మహిళలక మెట్రో, సిటీబస్సుల్లో ఉచిత ప్రయాణం ఎన్నికల తాయిలాలుగానే చెప్పాలి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్ సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయింది. భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.

మూడోస్థానంలో…..

ఇక లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానానికి పరిమితమయింది. అధికారంలో ఉన్న అరవింద్ క్రేజీవాల్ కు అనేక వర్గాలు దూరమయ్యాయని లోక్ సభ ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. కాంగ్రెస్ తో లోక్ సభ ఎన్నికలలో చేతులు కలిపి ఉంటే కొద్దో గొప్పో సీట్లు వచ్చేవన్నది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల అభిప్రాయం. అయితే ఎక్కువ స్థానాలను అరవింద్ కేజ్రీవాల్ కోరడంతో కాంగ్రెస్ అధిష్టానం పొత్తుకు అంగీకరించలేదు.

ఓటు బ్యాంకును తిరిగి….

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే తాను ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంగా ఆయనఈ ఆరు నెలల కాలం పనిచేయాల్సి ఉంటుందంటున్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో ఉన్న మొత్తం 70 స్థానాల్లో అరవింద్ కేజ్రీవాల్ 67 స్థానాలను గెలుచుకున్నారు. పార్టీలో అసంతృప్త నేతలు పెరిగిపోయారు. కీలక నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేసి అరవింద్ కేజ్రీవాల్ నెగ్గుకురాగలరా? అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News