ఉత్తపుణ్యానికే ఇస్తారా?

ఎవరైనా సమర్ధత చూస్తారు, సత్తా చూస్తారు. ఉత్త పుణ్యానికి పదవులు ఇవ్వరు కదా. రాజకీయాల్లో అయితే ప్రతీ రోజు యుధ్ధమే. అందువల్ల పదవులు కావాలనుకునే వారు తెలుసుకోవాల్సింది [more]

Update: 2019-10-22 05:00 GMT

ఎవరైనా సమర్ధత చూస్తారు, సత్తా చూస్తారు. ఉత్త పుణ్యానికి పదవులు ఇవ్వరు కదా. రాజకీయాల్లో అయితే ప్రతీ రోజు యుధ్ధమే. అందువల్ల పదవులు కావాలనుకునే వారు తెలుసుకోవాల్సింది ముందుగా తమను తాము నిరూపించుకోవడం. అధికార వైసీపీలో ఇపుడు పదవుల పంచాయతీ సాగుతోంది కానీ సమర్ధత ఉందా అన్నది మాత్రం చర్చకు రావడంలేదు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో చూసుకుంటే చాలా మంది వైసీపీ సీనియర్లతో పాటు జూనియర్లు కూడా పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. జగన్ తమ మీద దయ తలచకపోతారా అన్నది వారి ఆవేదన. కానీ జగన్ వద్ద అందరి జాతకాలు ఉన్నాయి, లెక్కలు కూడా ఉన్నాయి.

యువనేతలకు పట్టం…

విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత పార్టీ పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో ముప్పయి మంది అధికార ప్రతినిధులను తీసుకుంటే అందులో విశాఖ జిల్లా నుంచి ఇద్దరు ఉండడం విశేషం. వారు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్, మరొకరు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఇద్దరూ కూడా తొలిసారి ఎమ్మెల్యేలే. బాగా పోరాడి మరీ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇద్దరు బలమైన సామాజికవర్గాలకు చెందినవారే. ఇద్దరూ కూడా యువనేతలే. దాంతో జగన్ వారికి మంచి ప్రోత్సాహంగా ఉంటుందని పార్టీ పదవులు అప్పగించారు. పైగా వారు పార్టీ విధానాన్ని జనంలోకి తీసుకుపోవడంతో సత్తా చాటుతారని భావిస్తున్నారు.

ఇదే కొలమానమా…?

ఇపుడు వైసీపీలో పార్టీ పదవులు అయినా ప్రభుత్వ పదవులు అయినా పనికొచ్చే వారికే ఇస్తామని జగన్ చెప్పకనే చెబుతున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ కి అతి ముఖ్యమైన వీఆర్డీయే చైర్మన్ పదవి ఇచ్చినా, టీటీడీ మెంబర్ పదవి ఎలమంచిలి ఎమ్మెల్యే రాజు గారికి ఇచ్చినా వారి బలమే ఇక్కడ ప్రధానం. వారు జనంలో ఉండడమే కొలమానం. మరి విశాఖ అర్బన్ జిల్లాల నాయకులు మాత్రం కొందరు రోజూ వైసీపీ ఆఫీస్ కి వచ్చి మీడియా మీటింగులు పెట్టేసి చక్కా పోతున్నారు. తమకెందుకు పదవులు రావని కూడా వారు కలతపడుతున్నారు. మరి దగ్గర రూట్లు దేనికీ ఉండవన్న సంగతి ఇకనైనా గ్రహిస్తే జగన్ మార్క్ వడ్డనలో తొలి విస్తరి పనిచేసే వారిదే కావచ్చు.

Tags:    

Similar News