జగన్ పెరిగితే… బాబు తగ్గారు ?

జగన్ పెరగడం ఏంటి గత ఏడాదిగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయింది కదా. ఇదీ తెలుగుదేశంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఓ విధంగా అంతర్మధనం కూడా [more]

Update: 2020-06-20 12:30 GMT

జగన్ పెరగడం ఏంటి గత ఏడాదిగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయింది కదా. ఇదీ తెలుగుదేశంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఓ విధంగా అంతర్మధనం కూడా జరుగుతోంది. ఇదిప్పుడు అవసరమే. కానీ చేతులు అపుడే కాలిపోయాయి. ఆకులు పట్టుకుని వగచి వాపోవడమే తప్ప ప్రయోజనం లేదు. ఇంతకీ ఓడిపోతామని తెలిసి అయిదవ అబ్యర్ధిగా టీడీపీ నుంచి వర్ల రామయ్యను ఎందుకు నిలబెట్టినట్లు అంటే జగన్ కి పెరిగిన ఇమేజ్, ఓట్లను కళ్ళు రెండూ పెద్దవి చేసుకుని చూడడానికి అన్నట్లుగా పసుపు పార్టీలో సీన్ తయారైంది.

ఓట్లు పెరిగాయి…..

అవును నిజమే వైసీపీకి అసెంబ్లీలో 151 మంది బలం మాత్రమే ఉంది. కానీ 152 ఓట్లు రాజ్యసభ ఎన్నికల్లో వచ్చాయి. ఆ ఓటు కచ్చితంగా జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ నుంచి వచ్చినదే. ఆయన అధికార వైసీపీకే తన ఓటు అనేశారు. ఈ విధంగా పవన్ పార్టీ మద్దతు ఈ ఏడాది కాలంలో జగన్ సాధించారన్న మాట. మరో వైపు టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యే అనధికార మద్దతు కూడా జగన్ దే వారు ఓటు డైరెక్ట్ గా వేయకపోయినా జగన్ కీర్తనలే చేస్తున్నారు. ఆ ఓట్లు కలుపుకున్నా కూడా 154 అవుతాయి.

పరాభవమే….

ఇక చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారురా బాబూ అని తమ్ముళ్ళు అనుకునేలా ఇపుడు పరిస్థితి వచ్చిపడింది. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు గత ఏడాది ఇదే టైంలో టీడీపీ నుంచి గెలిచారు. అందులో ముగ్గురు డైరెక్ట్ రెబెల్స్ అయితే మరో మూడు ఓట్లు కూడా టీడీపీకి కాకుండా పోయాయి. ఇక ఎందుకో 17 ఓట్లు పడ్డాయనుకున్నా వారిలో కూడా కొందరు ఏమంత ఇష్టంగా వేసినట్లుగా కనిపించడంలేదు. ఏదో మొహమాటానికి అన్నట్లుగా వేసిన వారు కొందరు ఉన్నారని వారు కూడా ఇవాళ కాకపోతే రేపు అయినా వైసీపీ గూటికి చారుతారని అంటున్నారు. పైగా వైసీపీకి ఎవరి మద్దతు అవసరం కూడా లేదిపుడు. నిజానికి ఆ సీన్ కనుక వస్తే ఈ ఓట్లు కూడా బాబుకు పడకుండా చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.

పరువు గోవిందా ….

ఇక ఇంత పోటీ పెట్టి టీడీపీ ఉన్న పరువును పోగొట్టుకుంది అంటున్నారు. నిజానికి గత ఏడాది ఓటమే పెద్ద అవమానంగా ఉంటే ఇపుడు మళ్ళీ దాన్ని కెలుక్కునట్లుగా ఉందని తమ్ముళ్లే మండిపోతున్నారు. చంద్రబాబు పంతానికి పోయి పెట్టిన ఈ పోటీ వల్ల రెబెల్స్ మళ్ళీ బయటకు వచ్చి ఎంచక్కా చంద్రబాబుని కసితీరా తిట్టి పోయారు. ఆ తరువాత ఓట్లు అయినా పడలేదు. ఎవరిని భయపెట్టాలి అని బాబు అనుకున్నారో వారే భయపెట్టిపోయారు. మొత్తానికి చూసుకుంటే దళిత కార్డు మీద వర్ల రామయ్యను బరిలోకి దింపి బలి పశువు చేశారని ఆ వర్గం గుర్రుమంటోంది. చంద్రబాబు మరీ ఇంతలా దిగజారిపోయిన వ్యూహాలు వేస్తున్నారేంటి అని పసుపు పార్టీలోనే చర్చగా ఉందిపుడు.

Tags:    

Similar News