జగన్ స్ట్రాటజీ కూడా అదేనట…?

మొత్తానికి జగన్ అనుకున్నది సాధించారు. విశాఖను ఎలాగోలా లైమ్ లైట్ లో ఉంచారు. విశాఖను ఆయన పాలనా రాజధాని అని జగన్ అంటే కాదూ కాకూడదూ అని [more]

Update: 2020-11-02 12:30 GMT

మొత్తానికి జగన్ అనుకున్నది సాధించారు. విశాఖను ఎలాగోలా లైమ్ లైట్ లో ఉంచారు. విశాఖను ఆయన పాలనా రాజధాని అని జగన్ అంటే కాదూ కాకూడదూ అని టీడీపీ గట్టిగానే వ్యతిరేకించింది. కానీ అదే విశాఖ గురించి ప్రతీ రోజూ టీడీపీ పెద్దలు మాట్లాడాల్సిన పరిస్థితిని ఇపుడు జగన్ కల్పించారు. విశాఖను ఉన్నఫళంగా పొలిటికల్ క్యాపిటల్ చేసి పారేశారు. విశాఖ ఊసు లేని రోజు ఏపీ పాలిటిక్స్ లో లేదంటే అతిశయోక్తి కాదేమో. విశాఖని ఈ విధంగా జగన్ హైప్ చేస్తూంటే చంద్రబాబు అనివార్యంగా మాట్లాడాల్సివస్తోంది.

వివాదాలేనా…?

విశాఖ అంటే వివాదాలేనా అన్న తీరున ఇపుడు రాజకీయం సాగుతోంది. సరిగ్గా ఆరు నెలల క్రితం విష వాయువులు విశాఖలోని ఒక పరిశ్రమ నుంచి వెలువడి చాలా మంది ప్రాణాలు తీశాయి. ఆ ఘటన అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చగా కూడా మరింది. ఇక దానితో పాటే విశాఖ రాజధానిగా పనికిరాదంటూ టీడీపీ రాద్ధాంతం మొదలుపెట్టింది. అలా తెలియకుండానే టీడీపీ వైసీపీ ట్రాప్ లో పడిపోయింది. ఆ తరువాత అమ్మోనియం నిల్వలు విశాఖ నిండా ఉన్నాయంటూ మరో మారు గగ్గోలు పెట్టిన టీడీపీ విశాఖ భద్రత కలిగిన నగరం కాదంది. దీని కూడా జనం ముందే చర్చకు పెట్టి వైసీపీ మళ్ళీ వైజాగ్ ని టాక్ ఆఫ్ ది స్టేట్ చేసింది. జనంలోనూ విశాఖ రాజధాని సెంటిమెంట్ ఆ విధంగా రగిలేలా వైసీపీ పక్కా ప్లాన్ తో అడుగులు వేసింది.

అక్రమాలపైన అలా…..

విశాఖలో ఎన్నో దందాలు జరిగాయి. పలుకుబడి కలిగిన పెద్దలంతా విశాఖలో భూములను ఆక్రమించుకున్నారు. వారిలో రాజకీయ జీవులు ముందు వరసలోకి వస్తాయి. ఇక 1980లో మొదలైన గీతం విద్యా సంస్థకు నాటి ప్రభుత్వం 14 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు కట్టబెట్టింది. మరో వైపు 50 ఎకరాలు ఉంటే భవిష్యత్తు అవసరాలకు చాలు అని కూడా లెక్కలు వేశారు. అయినా వందల ఎకరాలను గీతం కూడగట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఆక్రమణ భూములే నలభై ఎకరాలు అని అంటున్నా కూడా ఇంకా అది ఎక్కువగానే ఉంటుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి చూసుకుంటే విశాఖలో వరసగా ఆక్రమ భూములను స్వాధీనం చేసుకుంటున్న వైసీపీ సర్కార్ ఇటీవల మాజీ ఎంపీ హరి ఇంటి ప్రహారీ గోడను కూల్చేసింది, ఇపుడు మరో మాజీ ఎంపీ విద్యా సంస్థల మీద గునపం దించింది. ఇవన్నీ కూడా ఇపుడు టీడీపీకి పెను సవాల్ గా మారాయి. విశాఖ మీదనే పూర్తిగా దృష్టి పెట్టి రాజకీయ పోరాటం చేయాల్సివస్తోంది.

ఒప్పుకోవాల్సిందే…..?

మామూలుగా రోజువారి రాజకీయాలన్నీ రాజధాని ఉన్న చోటనే జరుగుతాయి.ఏపీలో అయితే జగన్ అమరావతిలో ఉంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్నారు. కానీ రాజకీయం అంతా నడిచేది విశాఖలోనే. విశాఖలో చీమ చిటుక్కుమన్నా అది రీ సౌండ్ చేస్తోంది. దానికి ఉన్న ప్రాముఖ్యతను మరింతగా పెంచెసిన ఘనత వైసీపీది అయితే విశాఖ గురించి రోజులు పదే పదే వల్లె వేస్తూ నెమ్మదిగా టీడీపీ అమరావతిని మరచిపోతోంది. అచ్చంగా జగన్ స్ట్రాటజీ కూడా ఇదే. ఇది ఆరంభం మాత్రమేనని, విశాఖ గురించి ఇంకా రచ్చ చేసి టీడీపీ అరచి గీ పెట్టే ఘటనలు ముందు ముందు మరిన్ని ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి జగన్ విశాఖను అలా రాజధాని చేసేశారు అంటున్నా

Tags:    

Similar News