బీజేపీతో జ‌గ‌న్ వ్యూహాత్మ‌క చెలిమి.. ఏం జ‌రుగుతోంది?

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అది కూడా బ‌ల‌మైన సంఖ్యా బ‌లంతోనే ఉంది. ఈ క్ర‌మంలో ఏపీకి సంబంధించిన ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను [more]

Update: 2019-06-20 04:30 GMT

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అది కూడా బ‌ల‌మైన సంఖ్యా బ‌లంతోనే ఉంది. ఈ క్ర‌మంలో ఏపీకి సంబంధించిన ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను అమ‌లు చేయించుకునేందుకు వ్యూహాత్మ‌క చెలిమి చేయాల‌ని జగన్ మోహన్ రెడ్డి నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఆయ‌న సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌ముందే నేరుగా ఢిల్లీకి వెళ్లి.. ప్ర‌ధాని మోడీని క‌లిసి వ‌చ్చారు. ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై ఏక‌రువు పెట్టారు. అదే స‌మ‌యంలో ఆయ‌న ఏపీకి హోదా విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. అయితే, దీనిపై ఇప్ప‌టికే బీజేపీ ఓ నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో ఎలాగైనా బీజేపీ పెద్ద‌ల మ‌న‌సును క‌రిగించేందుకు జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

చంద్ర‌బాబులా, జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీజేపీని ఢీ కొట్టి, ఎద‌రొడ్డి చేసేదేం లేదు. ఈ విష‌యం ఆయ‌న‌కు తెలుసు. ఈ క్ర‌మంలోనే వీలున్న‌ప్పుడ‌ల్లా బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ పోతుంటే వాళ్ల మ‌న‌స్సు క‌ర‌గ‌క పోదా ? అన్న ప్లాన్‌తో జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. తాజాగా లోక్‌స‌భ స్పీక‌ర్ ఎన్నిక విష‌యాన్ని వైసీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. స్పీక‌ర్ ఎన్నిక‌కు సంబంధించి ఎడారి రాష్ట్రం రాజ‌స్థాన్‌లోని కోట పార్ల‌మెంటు స్తానం నుంచి గెలిచిన బీజేపీ నాయ‌కుడు ఓం బిర్లా పేరు ఖ‌రారైంది.

ఈ ప్ర‌తిపాద‌న తెర‌మీదికి వ‌చ్చిన వెంట‌నే వైసీపీ రంగంలోకి దిగింది. ఆయ‌న పేరును స్పీక‌ర్‌ప‌ద‌వికి స‌మ‌ర్ధిస్తూ.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంత‌కం చేశారు. ఇది స్పీక‌ర్‌ను స‌మ‌ర్ధిస్తూ.. చేసిన తొలి సంత‌కం కావ‌డంతో నేరుగా ప్ర‌ధాని దృష్టిని ఆక‌ర్షించేందుకు వైసీపీ వేసిన పాచిక‌లో భాగ‌మేన‌ని అంటున్నారు. గ‌తంలోనూ రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలోనూ వైసీపీ ఇలానే వ్య‌వ‌హ‌రించింది. అప్ప‌ట్లో ఏపీలో విప‌క్షంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వైసీపీ.. రాష్ట్ర‌ప‌తిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్ర‌తిపాదించ‌గానే కేంద్రం కోర‌కుండానే మ‌ద్ద‌తు తెలిపింది.

అదేవిధంగా ఉప రాష్ట్ర‌ప‌తి ఎంపిక స‌మ‌యంలోనూ ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించింది. ఇక‌, పీఎంవోతో నేరుగా వైసీపీ సంబంధాలు పెట్టుకుంది. త‌ర‌చుగా ఏపీకి సంబంధించిన విష‌యాల‌ను విజ‌య‌సాయి రెడ్డి ద్వారా పీఎంవోకు చేర‌వేసింది. ఇక‌, రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సీబీఐకి యాక్సెస్ ఇస్తూ.. తీర్మానం చేసింది. అదేవిధంగా మోడీ స‌హా కేంద్రంలో నెంబ‌ర్‌-2 గా ఉన్న అమిత్ షాతోనూ చెలిమి చేస్తోంది. మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్ర‌య‌త్నాల వెనుక చాలా వ్యూహమే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు

Tags:    

Similar News