Ycp : కమలాపురం కొంప ముంచుతుందా.. ఏంది?

కమలాపురం మున్సిపాలిటీకి వచ్చే నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇది ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కావడం, ఆయన మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో [more]

Update: 2021-11-09 08:00 GMT

కమలాపురం మున్సిపాలిటీకి వచ్చే నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇది ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కావడం, ఆయన మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో ఈ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. కమలాపురం మున్సిపాలిటీని ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కడప జిల్లాలో కమాపురంతో పాటు రాజంపేట మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఇన్ ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లాలో కీలక నేతలతో ఈ ఎన్నికపై చర్చించారు.

జగన్ మేనమామ….

కమలాపురం నియోజకవర్గానికి జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతోనే ఈ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే తొలిదశలోనే రవీంద్ర నాధ్ రెడ్డి ఫెయిల్ అయినట్లుగా కనపడుతుంది. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండటమే ఆయన పనితీరుకు అద్దం పడుతుంది. పెద్ద సంఖ్యతో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడంతో కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశముంది.

సింబల్స్ ఇబ్బందిగా….

పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరుగుతున్నా ఫ్యాన్ గుర్తు పోలి ఉన్న కొన్ని సింబల్స్ వైసీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టే అవకాశముందని వైసీపీ అధినాయకత్వం కూడా భావిస్తుంది. కమలాపురం మున్సిపాలిటీని కైవసం చేసుకోకుంటే రాష్ట్ర స్థాయిలో పరువుపోతుందని భావించి వైసీపీ అగ్రనేతలు ఇక్కడ రంగంలోకి దిగారు. ఇక్కడ ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకపోవడంతో కొంత ఆందోళన వైసీపీ నేతల్లో కనపడుతుంది. టీడీపీ నేతలు సయితం భారీగానే నామినేషన్లు వేశారు.

స్వతంత్రులు కూడా….

కమలాపురంలో మొత్తం 20 వార్డులుండగా మొత్తం 72 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి వార్డులోనూ అభ్యర్థులు బరిలో ఉండటంతో ప్రతి వార్డు ఎన్నిక కీలకంగా మారనుంది. టీడీపీ కూడా ఇక్కడ యాక్టివ్ కావడంతో పోటీ హోరాహోరీగా సాగే అవకాశముంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉండటంతో గుర్తుల సమస్య కూడా ఇబ్బంది కానుంది. దీంతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. రవీంద్ర నాధ్ రెడ్డికి సహకారం అందించేందుకు జిల్లా నేతలందరూ కమలాపురంలోనే తిష్ట వేశారు.

Tags:    

Similar News