ఈ యవ్వారం ఇప్పట్లో తేలేది కాదు

లాక్ డౌన్ కొనసాగింపు తో మరో 19 రోజుల పొడిగింపుపై దేశవ్యాప్తంగా మరోమారు చర్చ మొదలైంది. మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ఎత్తేస్తారా [more]

Update: 2020-04-15 17:30 GMT

లాక్ డౌన్ కొనసాగింపు తో మరో 19 రోజుల పొడిగింపుపై దేశవ్యాప్తంగా మరోమారు చర్చ మొదలైంది. మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ఎత్తేస్తారా అంటే సందేహమే అన్నది మోడీ మాటల్లో పరోక్షంగా వ్యక్తం అవుతుంది. మే 3 వ తేదీ కి పరిస్థితిని బట్టి సడలింపు లు ఉంటాయని అంటున్నారు. ఈలోగా ప్రజల్లో ముఖ్యంగా వలస కూలీల్లో అసహనం పెరిగిపోతుంది. దీనికి మహారాష్ట్ర లోని బాంద్రా రైల్వే స్టేషన్ కు సొంత ఊళ్లకు వెళ్లేందుకు వేలాదిమంది వచ్చి చేరారు. వీరికి చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేయాలిసి వచ్చింది.

సడలింపులు కొద్ది కొద్దిగా …

లాక్ డౌన్ దేశంలో ప్రస్తుతం బాగానే అమలు జరుగుతుంది. అయితే నెలల తరబడి ఇంట్లో ప్రజలను ఉంచడం అంత ఆషామాషీకాదు. వలస కూలీలలాగే అంతా గిలగిల్లాడుతున్నారు. వారికి ఉపాధి అవకాశాలు లేవు. సాయం కోసం ఇతరుల వైపు వేచి చూడాలి. దీనికంటే సొంత ఊళ్లకు వెళ్లి గంజి తాగి బతకాలనుకుంటారు. వీరిని ఆపడం ఇంక కష్ట సాధ్యమే అవుతుంది. ఇది రాష్ట్ర వ్యవహారమని, కేంద్రం, కేంద్రం భరోసా ఇవ్వలేదని రాష్ట్రాలు ఒకరిపై ఒకరు నెపాలు నెట్టుకుంటున్నారు.

20 దాకా అంతా వెయిటింగ్ ….

దీంతో ఈనెల 20 నుంచి లాక్ డౌన్ లో కొన్ని నిబంధనలు సడలిస్తూ రావొచ్చన్నది నిపుణులు అభిప్రాయంగా ఉంది. కొన్నింటికి, కొన్ని ప్రాంతాల్లో మినహాయింపులు ఉంటాయంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ప్రకటించే అవకాశముంది. ఈనేపధ్యంలో జరగబోయే పరిణామాలు అన్ని వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మే 3వ తేదీ సమయానికి మరిన్ని కేసులు పెరిగితే అప్పుడు మరికొన్ని రోజులు ప్రధాని లాక్ డౌన్ పొడిగిస్తారన్నది ఆయన మాటలను బట్టే తెలిసిపోయింది.

Tags:    

Similar News