మహాకూటమికి మైనస్ అదేనట

బీహార్ ఎన్నికలు చాలా చిత్రంగా జరుగుతున్నాయి. ఒకవైపు పూర్తిగా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అభ్యర్థి. మరోవైపు అనుభవం లేని నేత నేతృత్వంలోని కూటమి. మరోవైపు నిజాయితీ పరుడిగా ఉన్న [more]

Update: 2020-10-24 18:29 GMT

బీహార్ ఎన్నికలు చాలా చిత్రంగా జరుగుతున్నాయి. ఒకవైపు పూర్తిగా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అభ్యర్థి. మరోవైపు అనుభవం లేని నేత నేతృత్వంలోని కూటమి. మరోవైపు నిజాయితీ పరుడిగా ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థి. మరోవైపు అనేక అవినీతి ఆరోపణలున్న కుటుంబం నుంచి వచ్చిన నేత. ఇలా చెప్పుకుంటూ పోతే బీహార్ ఎన్నికల్లో ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల మధ్య ఆసక్తికరమైన చర్చ జాతీయంగా కూడా జరుగుతుంది.

నితీష్ పేరుతో…..

బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ప్రకటించింది. అయితే ఐదేళ్ల పాటు ఆయన పాలనపై ఉన్న అసంతృప్తి కొంత ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు. నితీష్ కుమార్ పై అవినీతి మచ్చ ఇంతవరకూ లేదు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయమూ ప్రజల సంక్షేమం కోసమేనని జనమూ నమ్ముతారు. మరోవైపు యూపీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వియాదవ్ ను ప్రకటించింది.

ఏ విషయంలోనూ…….

ఇదే మహాకూటమికి మైనస్ అన్న వ్యాఖ్యలు సర్వత్రా విన్పిస్తున్నాయి. నితీష్ కుమార్ తో పోల్చుకుంటే అనుభవంలోనూ, ఏ విషయంలనూ తేజస్వి యాదవ్ పనికిరారనే వాళ్ల సంఖ్య బీహార్ లో ఎక్కువగానే ఉంది. నిజానికి లాలూ యాదవ్ పై అవినీతి కేసులున్న ఆయన క్రౌడ్ పుల్లర్. మాస్ లీడర్. అయితే లాలూ యాదవ్ చిన్న కొడుకు తేజస్వి యాదవ్ కు మాత్రం మాస్ లీడర్ గా ముద్రపడలేదు. ఆయన జనంలో కలిసేది కూడా తక్కువేనంటారు.

బలవంతంగానే కాంగ్రెస్…..

తేజస్వి యాదవ్ కు నాయకత్వం పటిమ లేదని సొంతపార్టీనేతలే రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయిన సంఘటనలు చూశాం. అయితే లాలూ యాదవ్ నిర్మించిన బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో ఇక్కడ ప్రధాన పార్టీగా ఆర్జేడీ ఉంది. పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. బీహార్ లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఆర్జేడీ ప్రతిపాదనలకు తలొగ్గాల్సి వచ్చిందంటారు. తేజస్వియాదవ్ పేరును ప్రకటించకపోతే కొంత మహాకూటమికి లాభం చేకూరేదనే కామెంట్స్ బాగా విన్పిస్తున్నాయి. మొత్తం మీద బీహార్ మహాకూటమికి మైనస్ తేజస్వియాదవ్ అంటూ టాక్ బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News