సుజనా శిష్యుడికి వేరే పనిలేకనేనా?

అన్నం స‌తీష్ ప్రభాక‌ర్‌. ఈ పేరు ఇటీవ‌ల కొన్నాళ్లు మార్మోగింది. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న బాప‌ట్ల నుంచి పోటీ చేసి గెలుపు కోసం ప్రయ‌త్నించారు. అయితే, ప్రజ‌లు [more]

Update: 2019-09-06 08:00 GMT

అన్నం స‌తీష్ ప్రభాక‌ర్‌. ఈ పేరు ఇటీవ‌ల కొన్నాళ్లు మార్మోగింది. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న బాప‌ట్ల నుంచి పోటీ చేసి గెలుపు కోసం ప్రయ‌త్నించారు. అయితే, ప్రజ‌లు ఆయ‌న‌ను తిర‌స్కరించారు. గ‌తంలోనూ ఒక‌సారి విజ‌యం కోసం ప్రయ‌త్నించినా.. అది ద‌క్కలేదు. దీంతో చంద్రబాబు ఆయ‌న‌ను ఎమ్మెల్సీ చేశారు. కానీ, ప్రజ‌ల సేవ పేరుతో కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకున్న అన్నం.. త‌న వ్యాపారాల‌ను బ‌లోపేతం చేసుకునేందుకు రాజ‌కీయాల‌ను వాడుకున్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మార‌డంతో జ‌గ‌న్ త‌న‌ను ఎక్కడ టార్గెట్ చేస్తారోన‌ని ఆలోచించిన అన్నం.. వెంట‌నే పార్టీ మారిపోయారు.

సుజనా వెంటే…..

త‌న రాజ‌కీయ గురువు .. సుజ‌నా చౌద‌రి పార్టీ మారిపోవ‌డంతో ఆయ‌న కూడా పార్టీ మారిపోయి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, అన్నం సతీష్ తాజాగా కొన్ని కీల‌క వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జ‌రిగిన బ‌హిరంగ స‌ఛలో అన్నం సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకంగా సీఎం పీఠం గురించే ఆయ‌న వ్యాఖ్యలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. వాస్తవానికి ఆయ‌నకు పెద్ద ఇంపార్టెన్స్ లేక‌పోయినా.. చేసిన వ్యాఖ్యలు చాలా పెద్దవి కావ‌డంతో అంద‌రి దృష్టీ వాటిపైనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది చివ‌రి నాటికి రాష్ట్రంలో బీజేపీ-జ‌న‌సేన క‌లిసి పోతాయ‌ని ఆయ‌న సెల‌విచ్చారు.

సాధ్యమయ్యే పనేనా?

వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. క‌నీసం 83 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. టీడీపీ నుంచి ఓ ప‌ది మందిని లాగినా.. జ‌న‌సేనలోని ఒక‌రిని క‌లుపుకొన్నా 11 అవుతుంది. పోనీ.. వైసీపీలోని అసంతృప్తుల‌ను ద‌రిచేర్చుకున్నా.. ఈ సంఖ్య 50కి మించదు(అస‌లు వీరంతా వెళితే క‌దా?)., మ‌రి ఏ కాంటెస్ట్‌లో అన్నం వారు జోస్యం చెప్పారో.. ఇక‌, ఆయ‌న చెప్పిన దానిని బ‌ట్టి సీఎం ప‌వ‌న్ అయిపోతార‌ని అన్నారు. వాస్తవానికి ఈ క్రతువులో ఏదైనా చేయాల్సి వ‌స్తే.. బీజేపీ చేయాలి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబ‌ట్టి.. ఆ పార్టీ బెదిరించో.. బామాలో.. వైసీపీ ఎమ్మెల్యేల‌ను అక్కున చేర్చుకోవాలే.. త‌ప్ప.. ప‌వ‌న్‌కు ఇది చేత‌కాదు.

పవన్ టచ్ లో ఉన్నారంటూ….

అన్నం సతీష్ మాత్రం కేంద్రంలోని బీజేపీ పెద్దలు ప‌వ‌న్‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని మ‌రో బాంబు కూడా పేల్చారు. ఇక కొద్ది రోజులుగా ప‌వ‌న్‌, బీజేపీ, టీడీపీ అన్ని పార్టీలు క‌లుస్తాయ‌న్న టాక్ వ‌స్తోంది. ఈ మూడు పార్టీల నేత‌లు మూకుమ్మడిగా వైసీపీపైనే ఎటాక్ చేస్తున్నాయి. ఇక బీజేపీలో ప‌వ‌న్ కంటే పెద్ద నాయ‌కులు, పాత నాయ‌కులు చాలా మందే ఉన్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో క‌ష్టం అంతా తాము ప‌డి అధికారాన్ని సీఎం పీఠాన్ని మాత్రం ప‌వ‌న్‌కు ఎందుకు అప్పగిస్తారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న. ఊసుపోక‌.. చెప్పే క‌బుర్లు ఇలానే ఉంటాయ‌ని ఎద్దేవా చేస్తున్నారు విశ్లేష‌కులు. మ‌రి అన్నం సతీష్ మాట‌లు ఊహ‌లుగానే మిగిలిపోతాయా ? లేదా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News