అన్నాడీఎంకేకు అనివార్యమేనా?

తమిళనాడులో అన్నాడీఎంకేకు భారతీయ జనతా పార్టీతో కలసి వెళ్లడం తప్ప వేరే దారిలేదా? తన బలాన్ని నిలుపుకోవాలన్నా, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నా కమలం పార్టీతో జత [more]

Update: 2019-01-15 18:29 GMT

తమిళనాడులో అన్నాడీఎంకేకు భారతీయ జనతా పార్టీతో కలసి వెళ్లడం తప్ప వేరే దారిలేదా? తన బలాన్ని నిలుపుకోవాలన్నా, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నా కమలం పార్టీతో జత కట్టడం మినహా వేరే ఆప్షన్ ఇప్పుడు తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే లేదన్నది విశ్లేషకుల అంచనా. లోక్ సభ ఎన్నికలు అధికార అన్నాడీఎంకేకు ప్రతిష్టాత్మకం. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోకుంటే ఆ ప్రభావం రాష్ట్ర పాలనపైనా పడుతుంది. అందుకే లోక్ సభ ఎన్నికల్లో కనీస స్థానాలను గెలుచుకోవాలని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు యోచిస్తున్నారు.

డీఎంకే కూటమి…..

ఒకవైపు డీఎంకే బలంగా ఉంది. కాంగ్రెస్, డీఎంకే ఇతర చిన్న పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పడబోతున్నాయి. వివిధ సంస్థల సర్వేల ఫలితాలు కూడా డీఎంకేకే అనుకూలంగా వచ్చాయి. దీంతో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి ఇటీవల కాలంలో దూకుడు పెంచింది. అందివచ్చిన ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చకుంటోంది. కొడనాడ్ ఎస్టేట్ లోని హత్యల వెనక ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రమేయం ఉందన్న వార్తల నేపథ్యంలో డీఎంకే ఈ సంఘటనపై సీబీఐ విచారణ కోరుతోంది.

బలహీనంగా ఉండి…..

దీంతో బలహీనంగా ఉన్న అన్నాడీఎంకే తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్పదంటున్నారు. ఒకవైపు కొడనాడ్ ఎస్టేట్ వ్యవహారంతో పాటు డీఎంకేను కట్టడి చేయాలంటే కమలం ఆసరా అవసరమని అన్నాడీఎంకేలోని అత్యధిక మంది నేతలు భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీతో పొత్తుపై కొంత సందిగ్దంలో ఉంది. అగ్రవర్ణాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ కొంత పెరిగిందన్న ఆలోచనలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నారు.

పియూష్ తో చర్చలు….

ఇటీవల ప్రధాని సయితం పాతమిత్రులకు తాము ఆహ్వానం పలుకుతున్నామని ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి. తమిళనాడులో త్వరలోనే ప్రధాని పర్యటన ఉంది. ప్రధాని పర్యటనను సమీక్షించేందుకు ఈనెెల 18వ తేదీన కేంద్రమంత్రి పియూష్ గోయల్ చెన్నైకి రానున్నారు. పియూష్ గోయల్ తో పన్నీర్ సెల్వం పొత్తు అంశంపై చర్చిస్తారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద తమిళనాడులో బీజేపీతో కలవని అనివార్య పరిస్థితి అన్నాడీఎంకేకు ఉందన్న విశ్లేషణలు బాగానే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News