మంచి రోజులొస్తున్నాయా…??

అదే జరిగితే తమిళనాడులో అన్నాడీఎంకేకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు [more]

Update: 2019-05-21 17:30 GMT

అదే జరిగితే తమిళనాడులో అన్నాడీఎంకేకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు లీడర్లుగా ప్రజలు గుర్తించడం లేదు. క్యాడర్ కూడా వీరి నాయకత్వాన్ని నమ్మడం లేదు. వీరే కొనసాగితే భవిష్యత్తులో పార్టీ ఉండదని, రెండాకులు కనుమరుగవడం ఖాయమని భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కొందరు లీడర్లు కూడా అన్నాడీఎంకేను వీడే అవకాశం ఉందన్నసంకేతాలు విన్పిస్తున్నాయి.

డీఎంకే దూసుకుపోతుండటంతో….

మరోవైపు డీఎంకే స్టాలిన్ నాయకత్వంలో పుంజుకుంటోంది. అక్కడ ఏక నాయకత్వం కావడంతో పార్టీలో ఎలాంటి ఇబ్బందిలేదు. పైగా డీఎంకేకు రాష్ట్ర వ్యాప్తంగా కరుణానిధి నిర్మించి వెళ్లిన పట్టిష్టమైన క్యాడర్ ఉంది. సోదరుడు ఆళగిరితో కూడా స్టాలిన్ కు పెద్దగా ముప్పు లేదు. దీంతో డీఎంకే తమిళనాడులో పుంజుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు పార్టీకి బలమైన నేత కావాలని భావిస్తున్నారు. వారంతా ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ వైపు చూస్తున్నారు.

పార్టీ పెడతానని…

రజనీకాంత్ వచ్చే ఎన్నికల నాటికి కొత్త పార్టీ పెడతానని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాలను కూడా ఆయన చేర్చుకునే పనిలో ఉన్నారు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికలనే రజనీకాంత్ లక్ష్యంగా చేసుకున్నారు. కమల్ హాసన్ లాగా తొందరపడి ఎన్నికల గోదాలోకి దిగలేదు. ఈ రెండేళ్లు పార్టీ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఆయన పార్టీ ప్రకటన చేయనున్నారు. బహుశా వచ్చే ఏడాది రజనీ కాంత్ కొత్త పార్టీని ప్రకటించే అవకాశముందని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆయననే తీసుకువస్తే….?

కానీ రజనీకాంత్ ను పార్టీ పెట్టకుండా ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనను అన్నాడీఎంకేలోకి ఆహ్వానించి ఆయనకే పగ్గాలు అప్పగించాలన్న యోచనలో అన్నాడీఎంకే నేతలు ఉన్నారు. రజనీకాంత్ చేతుల్లోకి పార్టీలోకి వస్తు ఇటు శశికళ కుటుంబానికి చెక్ పెట్టడమే కాకుండా, మరోవైపు స్టాలిన్ ను కట్టడి చేయవచ్చన్న భావనలో ఎక్కువ మంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా కొందరు మంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వంపై ఈరకమైన వత్తిడి తెస్తున్నారు. కేంద్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ నేతల చేత రజనీ తో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రతిపాదనను రజనీ ముందుంచే అవకాశముంది. మరి రజనీ ఇందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News