ఆదుకుంటే ఎంత బాగుంటుంది?

తమిళనాడు ప్లాన్ ప్రకారం ముఖ్యమంత్రిస్థానంలో ఉన్న వ్యక్తిని కేసుల్లో అరెస్టు చేయొచ్చుగా! లేదా అధికారంలో ఉన్న పార్టీ నేతలపై కేసులు పెట్టి లొంగదీసుకుని, పార్టీని రెండుగా చీల్చి, [more]

Update: 2020-01-28 13:30 GMT

తమిళనాడు ప్లాన్ ప్రకారం ముఖ్యమంత్రిస్థానంలో ఉన్న వ్యక్తిని కేసుల్లో అరెస్టు చేయొచ్చుగా! లేదా అధికారంలో ఉన్న పార్టీ నేతలపై కేసులు పెట్టి లొంగదీసుకుని, పార్టీని రెండుగా చీల్చి, చీలిన రెండో వర్గాన్ని తమపార్టీలో కలిపేసుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ కూడా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చుగా? తన పార్టీ బలహీనపడి, ఒక జాతీయపార్టీ అవకాశాన్ని చేజార్చుకొని, ఇంకో యువకుడు ఆ జాతీయపార్టీ అండతో పెరుగుతాడనుకుంటే అదీ జరగకపోవడం ఎంత బాధ. రెండు సార్లు ఢిల్లీ వెళ్ళిన ఆ యువనేత ఒక్కటైనా చల్లటికబురుతో వస్తాడనుకుంటే ఇలా జరుగుతోందేంటి!?

ప్లాన్ ఏ…ప్లాన్ బీ అంటూ..

ప్లాన్ ఏ, ప్లాన్ బి… ఏదోఒకటి అమలు జరగాలి కదా! ఇవన్నీ జరగాలి. లేదా వీటిలో ఏదోఒకటి జరగాలి. నిన్నమొన్నటివరకూ రాష్ట్ర ప్రజలకు ఒక జాతీయపార్టీపై, ఆ పార్టీ నేతపైనా, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధిపైనా విద్వేషం కలిగించే ప్రయత్నం, వాళ్ళు ఆంధ్రా వస్తే నల్లజెండాలు చూపి, దేశంలోని పలురాష్ట్రాల్లో ఆ పార్టీకీ, ఆ నేతకూ, ఆ ప్రధాని అభ్యర్థికీ వ్యతిరేక ప్రచారం చేసినా అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఎలా?

ఆశతో చూస్తున్న…..

ఇప్పుడు వాళ్ళెవరైనా ఆదుకుంటే ఎంత బావుంటుంది అనే ఆశతో చూస్తున్న సమయంలో ఆశిస్తున్న ఒక్క ప్రత్యామ్నాయం కూడా కనుచూపుమేరలో చిగురుతొడుగుతున్నట్టు కనిపించకపోవడం ఎంత నిరుత్సాహం కలిగిస్తుంది! “ఈ ఉట్టి తెగదా? పాలగిన్నె పగలదా? పెనుతుఫాను వచ్చి ఉట్టిని గట్టిగా అటూ ఇటూ ఊపేయదా? భూకంపం వచ్చి భూమి కదిలితే ఉట్టి కదలకుండా ఉంటుందా? ఎలాగైనా ఆ పాలగిన్నె తొణక్క పోతుందా? ఆ పాలూ, పెరుగూ కారి కింద పడకుండా ఉంటాయా?” ఇప్పటికి ఏడునెలలేగా అయింది … ఇంకెంత … ఇంకా నాలుగున్నరేళ్ళకంటే తక్కువే… ఈ లోగా ఎన్నైనా జరగొచ్చు… ఎప్పుడైనా జరగొచ్చు… ఏమైనా జరగొచ్చు…అయినా జరిగితే ఎంత బావుణ్ణు… !! జరగకుండా పోతుందా… !!!

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News