దూకుడు మీద వున్న జగన్ సేన

అసెంబ్లీ సమావేశాలంటే అధికారపక్షం మీనమేషాలు లెక్కిస్తుంది. తప్పదు కనుక మమ అనిపించేందుకు కొద్ది రోజులపాటు నిర్వహించి స్కూల్ మూసేయడం రొటీన్ గా జరిగేది. కానీ ఇప్పుడు పాత [more]

Update: 2019-07-11 05:00 GMT

అసెంబ్లీ సమావేశాలంటే అధికారపక్షం మీనమేషాలు లెక్కిస్తుంది. తప్పదు కనుక మమ అనిపించేందుకు కొద్ది రోజులపాటు నిర్వహించి స్కూల్ మూసేయడం రొటీన్ గా జరిగేది. కానీ ఇప్పుడు పాత సంప్రదాయాలను చెరిపి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. విపక్షం ఎన్ని రోజులు కావాలిసి వస్తే అన్ని రోజులు నిర్వహిస్తాం. ఎంత సమయం కావాలంటే అంత సమయం విపక్షానికి ఇస్తాం అని సవాల్ విసరడం విశేషం.

తడబాటులో విపక్షం …

ఒక పక్క 151 సంఖ్యా బలంతో వున్న అధికారపక్షం. మరోపక్క 23 మందితో ఉందా లేదా అన్నట్లు వున్న విపక్షం. దాంతో సర్కార్ సవాల్ పై గట్టిగా ప్రతిసవాల్ విసరలేని పరిస్థితి తెలుగుదేశానిది. అసెంబ్లీ సమావేశాలు, విపక్షానికి కేటాయించాలిసిన సమయం, ఏ ఏ అంశాలు చర్చించాలి ? సభ నడవాలిసిన తీరుపై అసెంబ్లీ సమావేశాలకు ముందు బిఎసి లో చర్చించి నిర్ణయిస్తారు. దీనిపై స్పీకర్ నేతృత్వంలో సాగిన సమావేశంలో వైసిపి ఇచ్చిన ఆఫర్ కి టిడిపి షాక్ గురైంది. అసెంబ్లీ సమావేశాలు 14 రోజులుగా నిర్ణయించింది. విపక్షం కోరుకుంటే అర్ధవంతమైన చర్చలు జరిపేందుకు ఎన్ని రోజులైనా రెడీ అంటే మరిన్ని రోజులు కావాలని విపక్షం తరుపున హాజరు అయిన అచ్చెన్నాయుడు చెప్పలేక ఇబ్బంది పడ్డారు.

బాబు టీం ను ఉతికేందుకేనా …?

అసెంబ్లీ సమావేశాల్లో బలమైన అధికారపక్షం అడుగడుగునా చంద్రబాబు గతంలో చేసిన తప్పులపై విరుచుకుపడుతుంది. తొలి సమావేశాల్లో జగన్ టీం దూకుడు చూసి టిడిపి కిందా మీదా పడింది. ఇప్పుడు కూడా బాబు చేసిన అవకతవకలు అక్రమాలు, అవినీతి వెలికితీతకు ఇప్పటికే జగన్ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన ప్రాధమిక నివేదిక లో బాబు పాలన లో తప్పులు చేతికి అందినట్లు వైసిపి వర్గాల్లో టాక్. గతంలో అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేయడం అడుగడుగునా అవమానాలు చేసిన తీరు ను మరువని జగన్ అంతకంతా ప్రతీకారం కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. వీటిని తప్పించుకోవడానికి టిడిపి చాణ్యుక్యుడి వ్యూహం ఎలా వుండబోతుందన్నది ఆసక్తికరం.

Tags:    

Similar News