ఏపీలో హైరిస్క్ అక్కడే…. అందుకే అక్కడ అలా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఒక్కరోజులోనే ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో [more]

Update: 2020-07-25 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఒక్కరోజులోనే ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో లాక్ డౌన్ ను విధించి కరోనా కట్టడికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రారంభమైన తొలినాళ్లలో ఒక్క కర్నూలు, గుంటూరు జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇప్పటికే ఏపీలో కరోనా కేసులు 90 వేలకు చేరువలో ఉన్నాయి.

మూడు జిల్లాల్లోనే….

మరీ ముఖ్యంగా గత పది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువా ఉంది. ఏపీలోని మూడు జిల్లాలు హైరిస్క్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తిరుపతి, నెల్లూరు, భీమవరం, విజయనగరం, సిక్కోలు వంటి ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. పరీక్షలు ఎక్కువగా చేస్తుండటంతో వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

తూర్పులో అత్యధికంగా…..

మే వరకూ కరోనా ఫ్రీ జిల్లాలుగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వైరస్ అధికంగా ఉంది. ఏపీలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఏపీలో అత్యధికంగా పదివేల కేసులు దాటిపోయాయి. దీంతో ఇక్కడ ప్రతి ఆదివారం లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.

రానున్న కాలంలో….

మరోవైపు తొలి నుంచి వైరస్ ఉధృతిగా ఉన్న కర్నూలు జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు దాటాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అలాగే గుంటూరు జిల్లాలోనూ అంతే సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వలస కార్మికులు, కోయంబేడు మార్కెట్ కారణంగానే ఎక్కువ కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలో ఈ జిల్లాలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ మూడు జిల్లాలు హైరిస్క్ లో ఉన్నట్లే చెప్పుకోవాలి. ప్రజలు స్వీయనియంత్రణ పాటించడమే ఏకైక మార్గం.

Tags:    

Similar News