చెక్ ల వెనుక జరుగుతుంది ఇదా …?

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం ఆర్ధికంగా పాతాళానికి పడిపోయినా ఎపి ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్ట గా తీసుకుని మహిళా ఓటర్లపై బ్రహ్మాస్త్రం సంధించారు. అదే డ్వాక్రా [more]

Update: 2019-02-04 03:06 GMT

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం ఆర్ధికంగా పాతాళానికి పడిపోయినా ఎపి ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్ట గా తీసుకుని మహిళా ఓటర్లపై బ్రహ్మాస్త్రం సంధించారు. అదే డ్వాక్రా మహిళలకు పదివేలరూపాయలు అందించే బృహుత్తరా కార్యక్రమం. జనం సొమ్ముతో ముందే ఓటర్లకు గాలం వేసే బాబు మాష్టర్ ప్లాన్ కి తూట్లు పడేలా కొందరు వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశానికి పడాలిసిన ఓట్లు దూరం చేసేలా చేస్తుంది. అవినీతికి బాగా అలవాటు పడిన కొందరు సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో చెక్కులు చేతికి అందాలంటే తమ చేతులు తడపాలి అని మొహమాటం లేకుండా బేరం పెట్టేస్తున్నట్లు సమాచారం. అసలు ఇచ్చే చెక్ లు పూర్తిగా చెల్లింపు లేకపోయినా ముందే సొమ్ములు పంపిణీ దారులకు చెల్లించి కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టాలిసి వస్తుందని పేద మహిళలు వాపోతున్నారు.

దళారులను అరికట్టాలని చూస్తున్నా …

డ్వాక్రా మహిళలకు చంద్ర బాబు నజరానా సందర్భంగా దళారుల ప్రమేయం లేకుండా ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయినా కానీ వారి కానుకలను కాకులు ఎత్తుకుపోతున్న పరిస్థితి దాపురించింది. రాష్ట్రంలో 94 లక్షలమంది డ్వాక్రా మహిళలకు టిడిపి సర్కార్ పదివేలరూపాయల సొమ్ములు మూడు చెక్ ల రూపంలో పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమంలో పర్యవేక్షణ లోపించడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. సర్కార్ ఇప్పటికైనా ఈ చెక్కుల పంపిణీ వెనుక సాగుతున్న బాగోతంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు కోరుకుంటున్నారు. మరి వారి ఆందోళనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News