వార్ వన్ సైడేనా…??

సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొదటి విడత లో భాగంగా 20 రాష్ట్రాల్లోని 91 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. పార్లమెంటు [more]

Update: 2019-04-11 00:30 GMT

సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొదటి విడత లో భాగంగా 20 రాష్ట్రాల్లోని 91 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. పార్లమెంటు ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఏపీలోని 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నేతల తలరాతలను నిర్ణయించనున్నారు. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఈసారి పోలింగ్ కు ఏర్పాట్లు జరిగాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ క్యాస్టింగ్ చేయనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం హెలీకాఫ్టర్లను కూడా సిద్ధం చేసి ఉంచారు. మొత్తం 18 వేల మంది భద్రతా దళాలు ఎన్నికల విధుల్లో ఉన్నాయి.

3,93,45,717 మంది ఓటర్లు…

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3,93,45,717 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,94,62,339 ఉండగా, మహిళలు 1,98,79,421, ఇతరులు 3,9,57 మంది ఉన్నారు. మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 413 కేంద్రాలను గుర్తించారు. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ మొత్తం 2,395 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 25 లోక్ సభ స్థానాలకు 344 మంది పోటీలో ఉన్నారు. టీడీపీ, వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తుండగా జనసేన కూటమి 137 స్థానాలకు, బీజేపీ 173 స్థానాల్లో, కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేస్తోంది. అత్యధికంగా గుంటూరు వెస్ట్ నుంచి 34 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా మంగళగిరిలో 32 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యల్ఫంగా ఇచ్చాపురం, రాజాం, ఆమదాలవలస, కురుపాం, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఆరుగురు చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News