ఎపి సిఎం వైఎస్ జగన్ మొహమాట పడలేదుగా ?

ఎపి కి దిక్కు మొక్కు ప్రత్యేక హోదా మాత్రమే. లోటు బడ్జెట్ తో కేవలం వ్యవసాయ రంగం పై మాత్రమే ఆధారపడిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే స్పెషల్ స్టేటస్ [more]

Update: 2019-06-16 09:00 GMT

ఎపి కి దిక్కు మొక్కు ప్రత్యేక హోదా మాత్రమే. లోటు బడ్జెట్ తో కేవలం వ్యవసాయ రంగం పై మాత్రమే ఆధారపడిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే స్పెషల్ స్టేటస్ మాత్రమే సంజీవిని అని తేల్చేశారు. కాంగ్రెస్ విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందని దానికి బిజెపి అంగీకరించిందని గుర్తు చేస్తూ కుండబద్దలు కొట్టారు ఎపి సిఎం వైఎస్ జగన్. హోదా కోసం కడదాకా పోరాడతా అన్న తన మాటను నిలబెట్టుకుంటూ నీతి ఆయోగ్ లో ఎపి ముఖ్యమంత్రి దేశం దృష్టికి ఎపి ఆర్ధిక దుస్థితిని కళ్ళకు కట్టినట్లు వివరించారు. అడ్డగోలు విభజన వల్ల ఎపి ప్రజలు నష్టపోయిన తీరును కీలక సమావేశం లో తనదైన శైలిలో ఆవిష్కరించారు. పనిలో పనిగా ఎపి కి హోదా కోసం టిడిపి ప్రయత్నం చేసింది ఏమి లేదని దుమ్మెత్తిపోశారు. ప్రధాని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఐటి వంటి వన్ని హైదరాబాద్ లో ఉండటం పారిశ్రామికంగా భాగ్యనగరం తలసరి ఆదాయం లో దూసుకుపోతున్న తీరు జగన్ చాటి చెప్పారు.

రాజీ పడని ధోరణి ….

జగన్ నీతి ఆయోగ్ సమావేశాన్ని ఈరకంగా వినియోగించుకుంటారు అని ఎవ్వరు ఊహించలేదు. నరేంద్ర మోడీ తో సఖ్యత కారణంగా ఎపి ముఖ్యమంత్రి ఇవన్నీ ప్రస్తావిస్తారని విశ్లేషకులు సైతం భావించలేదు. అయితే అనూహ్యంగా జగన్ ఎపి ప్రయోజనాలకోసం చాలా సీరియస్ గానే గళమెత్తి అందరి ప్రశంసలు అందుకున్నారు. హోదా తమ హక్కు అని ఎపి నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇచ్చిన హామీ అని నొక్కి చెప్పి బిజెపి సర్కార్ బాధ్యతను గుర్తు చేయడం విశేషం. గతంలో కేసుల కోసం జగన్ రాజీ పడ్డారని అందుకే విభజన హామీలపై తమ పార్టీ పరంగా సహకారం ఇవ్వడం లేదంటూ టిడిపి ఆరోపణలు విమర్శలు గుప్పించేది. అయితే జగన్ ఇలాంటి విమర్శలకు నీతి ఆయోగ్ లో ధీటుగా స్పందించి తిప్పికొట్టారు. గతంలో ఎన్డీయే లో భాగస్వామిగా వున్నా టిడిపి ఈ స్థాయిలో తమ గళాన్ని వినిపించకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వైసిపి వర్గాలు గొంతు పెంచాయి. మరో వైపు హోదా అంశం పై పార్లమెంట్ లో నాలుగవ అతిపెద్ద పార్టీ గా వున్న వైసిపి ఎలా వ్యవహరించాలో దిశా నిర్ధేశం చేయడం గమనార్హం

Tags:    

Similar News