Bjp : అక్కడి నుంచే ఆదేశాలా? అందుకే అలా చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీపై అనేక సందేహాలు వస్తున్నాయి. అసలు పార్టీ నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం, మీడియా సమావేశాలు [more]

Update: 2021-11-06 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీపై అనేక సందేహాలు వస్తున్నాయి. అసలు పార్టీ నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం, మీడియా సమావేశాలు మినహా ఆ పార్టీ నేతలు చేస్తున్నదేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంకా ఎన్నికలకు మూడేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీపై దూకుడుగా వ్యవహరించాల్సిన బీజేపీ కేవలం ఉప ఎన్నికలకే పరిమితమయిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

తెలంగాణలో నేతలు….

పొరుగున ఉన్న తెలంగాణలో బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ఎన్నిక మాత్రమే కాదు మిగిలిన సమయాల్లో ఆందోళనలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా పాదయాత్ర చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు, ఆందోళనలు చేయడంతో క్యాడర్ లో కూడా ఉత్సాహం నెలకొంది. మరోవైపు ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి సవాల్ విసురుతుంది.

రధయాత్ర అంటూ….

తెలంగాణతో పోల్చుకంటే ఏపీ బీజేపీ అసలు ఏం చేయడం లేదనే అనుకోవాలి. అప్పుడెప్పుడో దేవాలయంలో దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలకు సంంబంధించి తిరుపతి లోని కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ పాదయాత్ర చేస్తామని బీజేపీ ఆర్భాటంగా ప్రకటించింది. తర్వాత దానిని వాయిదా వేసుకున్నారు. ఆ సమస్య కూడా కన్పించకుండా పోయింది. ఇక అమరావతి నుంచి బెజవాడ వరకూ పాదయాత్ర చేస్తామని ప్రకటించి మధ్యలోనే మానుకుంది.

మీడియా పులులే…

రాష్ట్రంలో సమస్యలేవీ లేవా? అంటే చాలా ఉన్నాయి. విపక్షాలు ఆందోళనకు దిగేందుకు చాలానే ఉన్నాయి. కేవలం అధికార పార్టీని ట్విట్టర్, మీడియా సమావేశాల్లో ప్రశ్నించడమే తప్ప జనంలోకి వెళ్లే ప్రయత్నాలు బీజేపీ చేయడం లేదు. దీనికి కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలు కూడా కారణం కావచ్చన్న వాదన కూడా ఉంది. మొత్తం మీద తెలంగాణతో పోల్చుకుంటే పార్టీ ఎదగడానికి ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు శూన్యమేనని చెప్పాలి.

Tags:    

Similar News