andhra : కులాల కుంపటిపై కరెక్ట్ గానే చెప్పారు

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కరెక్ట్ గా చెప్పారు కానీ, చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కమ్మ నాయకుడిగా క్లెయిమ్ చేసుకోలేదు. ఆయనకు టీడీపీకి కుల ముద్ర ఉన్నా [more]

Update: 2021-10-04 02:00 GMT

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కరెక్ట్ గా చెప్పారు కానీ, చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కమ్మ నాయకుడిగా క్లెయిమ్ చేసుకోలేదు. ఆయనకు టీడీపీకి కుల ముద్ర ఉన్నా జనం సర్దుకు పోయారు. జగన్ రెడ్ల నాయకుడు అన్నా సర్దుకుపోయారు. వాళ్ళు తమ కులానికి అధికారం ఇవ్వండి అని అడగలేదు. జనాన్ని మభ్య పెట్టారు కూడా. కానీ ఊళ్లలో కింద కులాల జనానికి పేచీ కమ్మ, రెడ్ల కంటే ఎక్కువ కాపులతోనే ఉంటుంది.

గ్రామ స్థాయిలో….

వాళ్ళకి పేచీ కావాలి. కమ్మ, రెడ్లతో సమానమైన గౌరవం కావాలి. ఇప్పుడు కాపులకు అధికారం అనే పవన్ కల్యాణ్ నినాదం ఆయనకు మేలు చేస్తుందో లేదో కానీ చంద్రబాబుకి మాత్రం నష్టం చేస్తుంది. పవన్ కల్యాణ్ తెలియకుండానే చంద్రబాబుకు నష్టం చేస్తున్నారన్న విశ్లేషణలు కూడా విన్పిస్తున్నాయి. కాపు, కమ్మలకు మద్దతిస్తే మిగిలిన కులాలన్నీ టీడీపీకి వ్యతిరేకమయ్యే అవకాశాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కన్పిస్తున్నాయి.

ఇతర కులాలనే నమ్ముకుంటూ…

మరోవైపు జగన్ కూడా కమ్మ, కాపు కులాలను నమ్ముకోకుండా ముందుకు వెళుతున్నారు. ఇతర సామాజికవర్గాల వారిని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బీసీలు, అగ్రవర్ణాల్లో మిగిలిన వారిని, మైనారిటీలను, ఎస్సీలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు జగన్ మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాలు లేకుండా నడుస్తాయనుకుంటే ఇది భ్రమే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే ఏపీలో కుల పోరాటాలకు బీజం పడింది.

వాళ్లు సర్దుకోకపోతే?

జగన్ పై మొత్తం కమ్మ కులంలో వ్యతిరేకత తీసుకురావడంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు తో కలిసి విజయం సాధించారు. ఆ సామాజికవర్గంలో ఎప్పుడూ, ఏ నాయకుడిపై లేనంత వ్యతిరేకత జగన్ పై వచ్చింది. ఇక జగన్ కూడా ఊరుకోలేదు. ప్రశాంత్ కిషోర్ తో జట్టు కట్టి కమ్మ కులంపై మిగతా అన్ని కులాల్లో వ్యతిరేకత తీసుకురావడంలో విజయం సాధించారు. చంద్ర బాబు వెనుక ఉన్నవాళ్ళు, జగన్ వెనుక ఉన్నవాళ్ళు తమ విధానం సరిదిద్దుకోకపోతే ఈ కులాల కుంపటి రగులుతూనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పవన్ కల్యాణ్ చేరారు. అవును, వాళ్ళు సరిదిద్దుకోవాల్సిందే. లేదంటే ఇలా గోక్కుంటూ, గీక్కుంటూ, గీసుకుంటు, రాసుకుంటూ ఉండాల్సిందే. ఈ దురద తగ్గదు. ఈ బురద పోదు. కులాల లేని ఏపీని భవిష్యత్ లో చూడలేకపోవచ్చు.

Tags:    

Similar News