పట్టాభి ప్రజానాయకుడు.. విష్ణు వేస్ట్ లీడరా?

ఈరోజు ఆంధ్రజ్యోతి లో రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో కొన్ని వాస్తవాలున్నాయి. బీజేపీలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల కారణంగా బలం పూర్తిగా పోయిందని రాశారు. అలాగే [more]

Update: 2021-02-28 09:30 GMT

ఈరోజు ఆంధ్రజ్యోతి లో రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో కొన్ని వాస్తవాలున్నాయి. బీజేపీలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల కారణంగా బలం పూర్తిగా పోయిందని రాశారు. అలాగే నలుగురు బీజేపీ నేతలు జగన్ కు కొమ్ముకాస్తున్నారని రాశారు. సోము వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్ లు జగన్ కు అండగా ఉన్నారని, పార్టీ ప్రయోజనాలు పణంగా పెట్టారని రాధాకృష్ణ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇందులో కూడా నిజం ఉండే ఉంటుందేమో.. కాదనలేం.

అతిగా ఊహించుకుంటున్నారని….

కానీ విష్ణువర్థన్ రెడ్డి ప్రజానాయకుడు కాదని, ఆయన తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని రాధాకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇక్కడే రాధాకృష్ణ తన పసుపు కళ్లద్దాలను ఉపయోగించారు. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీలో అనేక ఏళ్లుగా నాయకుడిగా కొనసాగుతున్నారు. నెహ్రూ యువకేంద్ర కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. కేబినెట్ ర్యాంకు ఉన్న పదవిలో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఏ ఎన్నికల్లో గెలవలేకపోవచ్చు. కానీ ప్రజా క్షేత్రంలో విష్ణువర్థన్ రెడ్డి కొన్నేళ్లుగా సమస్యలపై ఉద్యమిస్తూనే ఉన్నారు.

పట్టాభిపై దాడి జరిగితే….

కొన్ని రోజుల క్రితం గర్తుండే ఉంటుంది. విజయవాడలో టీడీపీ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్ పై కొందరు దాడి చేశారు. అదే దాడిపై రాధాకృష్ణ యాగీ యాగీ చేశారు. పట్టాభిని ఒక మహానేతగా పొగిడారు. ప్రజాస్వామ్యం మంటగలిసిందని వాపోయారు. మరి పట్టాభి ఎప్పుడు టీడీపీలోకి వచ్చారో ఆయనకు తెలియంది కాదు. ఆయన ఎన్నేళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నారో రాధాకృష్ణకు తెలుసు. కానీ పట్టాభి మాత్రం రాధాకృష్ణ దృష్టిలో ప్రజానేత. ఆయనపై దాడి జరిగితే రాక్షస దాడి.

ఆ రోజులు పోయాయి….

కానీ తన స్టూడియోలోనే విష్ణువర్థన్ రెడ్డి పై జరిగిన దాడిని రాధాకృష్ణ సమర్థించుకుంటున్నట్లే ఈ వ్యాసం సాగింది. పట్టాభిపై బయట వ్యక్తులు దాడికి పాల్పడవచ్చు. అది వ్యక్తిగత కక్ష అయినా కావచ్చు. రాజకీయ కక్ష అయినా ఉండవచ్చు. వైసీపీ నేతలే దాడి చేశారని నాడు రాధాకృష్ణ పేపర్, టీవీలో హోరెత్తించారు. కానీ అదే విష్ణువర్థన్ రెడ్డిపై తన స్టూడియోలో దాడి జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని బుకాయిస్తూ రాధాకృష్ణ రాయడంతోనే అసలు విషయం బయటపడింది. మరి ఈ రాతలు సామన్యుడికి కూడా అర్థమవుతాయి రాధాకృష్ణా. నువ్వు కాదంటే ప్రజానాయకులు కాకపోతారా? నువ్వు ఊ అంటేనే లీడర్ అవుతారా? అన్న రోజులు పోయాయి.

Tags:    

Similar News