Ys jagan : పదవులు ఊరికే రావు.. ఇలా వస్తాయి…?

వైసీపీలో ఎవరికి పదవి ఇవ్వాలన్నా వారి బ్యాక్ గ్రౌండ్ చూస్తారు. రాజకీయంగా తమ పార్టీకి ఎలా ఉపయోగపడ్డారు? భవిష‌్యత్ లో ఎలా ఉపయోగపడతారన్నది బేరీజు వేసుకున్న తర్వాతే [more]

Update: 2021-11-13 06:30 GMT

వైసీపీలో ఎవరికి పదవి ఇవ్వాలన్నా వారి బ్యాక్ గ్రౌండ్ చూస్తారు. రాజకీయంగా తమ పార్టీకి ఎలా ఉపయోగపడ్డారు? భవిష‌్యత్ లో ఎలా ఉపయోగపడతారన్నది బేరీజు వేసుకున్న తర్వాతే జగన్ పదవులను ఇస్తారు. తాము కూడా ఊహించని నేతలకు పదవులు దక్కుతుండటం వైసీపీలో జోష్ నింపుతుంది. భవిష్యత్ లో పార్టీకి పనిచేస్తే పదవులు దక్కుతాయన్న సంకేతాలను జగన్ పార్టీ నేతలకు బలంగా పంపగలిగారు. ఆ కోవలోకి చెందినదే తూర్పు గోదావరి జిల్లా అనంత ఉదయ భాస్కర్ నియామకం.

పార్టీ ఆవిర్భావం నుంచి….

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన నేత అనంత ఉదయ భాస్కర్. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే ఉన్నారు. రంపచోడవరంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. రంపచోడవరం రిజర్వడ్ నియోజకవర్గం. అనంత ఉదయ భాస్కర్ కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఆయనకు అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదు. ఈ కారణంగానే జగన్ ఏరికోరి ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు.

ఆయన చెప్పిన వారికే….

రంపచోడవరంలో అనంత ఉదయ భాస్కర్ చెప్పిన అభ్యర్థికే ఎమ్మెల్యే సీటు దక్కుతుంది. వైసీపీ అభ్యర్థి గెలుపును ఆయన తన భుజస్కంధాలపై వేసుకుంటారు. 2014లో వంతల రాజేశ్వరిని ఆయన వైసీపీ అభ్యర్థిగా ప్రతిపాదించడంతో జగన్ ఓకే చేశారు. తీరా గెలిచిన తర్వాత వంతల రాజేశ్వరి వైసీపీిని వీడి టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో అనంత ఉదయ భాస్కర్ భాగ్యలక్ష్మి పేరును ప్రతిపాదించినా వెంటనే ఓకే చెప్పేశారు.

నమ్మకంతో…..

రంపచోడవరంలో పార్టీ రెండు సార్లు గెలుస్తూ వస్తుందంటే దానికి కారణం అనంత ఉదయ భాస్కర్. ఎమ్మెల్యేతో కొంత విభేదాలున్నప్పటికీ వైసీపీ క్యాడర్ ఎక్కువగా ఆయన చెప్పినట్లే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి పెద్దల సభకు పంపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ ఇచ్చి నమ్మకంతో పనిచేస్తే పదవులు వస్తాయన్న సంకేతాలను పంపారు.

Similar News