గ్రిప్ పెంచుకునేందుకు ఆనం వారితో చేతులు కలిపారా?

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మళ్లీ గ్రిప్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు సిటీపై పట్టు సంపాదించేందుకు కసరత్తులు [more]

Update: 2020-07-15 03:30 GMT

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మళ్లీ గ్రిప్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు సిటీపై పట్టు సంపాదించేందుకు కసరత్తులు ప్రారంభించారు. దీంతో వైసీపీలో విభేదాలు మరింత ముదిరే అవకాశముంది. ఆనం కుటుంబానికి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో పట్టు ఉండేది. ఆనం వివేకానందరెడ్డి జీవించి ఉన్న రోజుల్లో ఆయన సిటీకే ఎక్కువగా పరిమితమయ్యే వారు.

సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో…..

ఆనం వివేకానందరెడ్డి మరణం, నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో మంత్రి అనిల్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆనం క్యాడర్ ఇబ్బందులుపడుతోంది. ప్రధానంగా వీఆర్ కళాశాల వ్యవహారం ఆనం కుటుంబీకులకు, అనిల్, కోటంరెడ్డిలకు మధ్య చిచ్చు పెట్టింది. మంత్రి పదవి కూడా దక్కకపోవడం అసహనానికి కారణమయింది. దీంతో ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలపై తిరిగి పట్టు సంపాదించుకునేందుకు రెడీ అయ్యారు.

బ్రదర్స్ ఇద్దరూ ఏకమై…..

ఆనం రామనారాయణరెడ్డికి ముగ్గురు సోదరులు. మొత్తం నలుగురు సోదరుల్లో ఆనం వివేకానందరెడ్డి చనిపోగా మిగిలిన ముగ్గురులో ఆనం రామనారాయణరెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డిలు వైసీపీలోనూ , ఆనం జయకుమార్ రెడ్డి టిడిపిలోనే కొనసాగుతున్నారు. వైసీపీలో ఉన్న ఆనం రామనారాయణెరడ్డి, విజయకుమార్ రెడ్డిల మధ్య కూడా విభేదాలున్నాయి. ఆయనకు డీసీసీబీ ఛైర్మన్ ఇస్తే అభ్యంతరం చెప్పారని అప్పట్లో ఇద్దరు సోదరుల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే ఆనం సోదరులకు ఇప్పుటికి తెలిసి వచ్చింది.

ఏసీ సెంటర్లో అందుబాటులో….

తాము నెల్లూరు సిటీ, రూరల్ లో పట్టుకోల్పోతున్నామని భావించిన సోదరులిద్దరూ ఏకమయ్యారు. ఇకపై నెల్లూరు సిటీ, రూరల్ లో తమ క్యాడర్ కు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆనం కుటుబంలోని యువనేతలైన రంగమయూర్ రెడ్డి, కార్తీక్ రెడ్డిలు ఏసీ సెంటర్లో ఇక నుంచి ప్రతీ రోజూ అందు బాటులో ఉండేలా నిర్ణయించారు. అంతేకాదు ఆనం రామానారాయణరెడ్డి టీడీపీ నేతలతోనూ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొందరు టీడీపీ నేతలు ఆయన ఇంటి నుంచి వస్తున్న వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మొత్తం మీద ఆనం రామనారాయణరెడ్డి తిరిగి నెల్లూరు సిటీ, రూరల్ లో కెలికే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News