శత్రువులు డీలా పడ్డారా?

ఆనం రామనారాయణరెడ్డి పై ముఖ్కమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటారని కొందరు భావించారు. ఆనం రామనారాయణరెడ్డి లాంటి నేతపై చర్య తీసుకుంటే రాష్ట్ర మంతటా పార్టీ సెట్ [more]

Update: 2019-12-21 12:30 GMT

ఆనం రామనారాయణరెడ్డి పై ముఖ్కమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటారని కొందరు భావించారు. ఆనం రామనారాయణరెడ్డి లాంటి నేతపై చర్య తీసుకుంటే రాష్ట్ర మంతటా పార్టీ సెట్ అవుతుందని కొందరు పార్టీ అధినేతకు సలహా కూడా ఇవ్వబోయారు. ఆనం రామనారాయణరెడ్డి చేసిన కామెంట్స్ తో ప్రభుత్వం పరువు పోయిందని, విపక్షాలకు అస్త్రం అందించినట్లయిందని ఆనం వ్యతిరేకులు బాగానే ప్రచారం చేశారు.

కామెంట్స్ తో కాక పుట్టించి…..

ఆనం రామనారాయణరెడ్డి అధికార పార్టీ మీదనే ఇటీవల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు ఇసుక, ల్యాండ్ మాఫియాలతో పాటు క్రికెట్ బెట్టింగ్ పెరిగిపోయిందని, వరసగా పోలీసు అధికారులను బదిలీ చేస్తుండటంతో మాఫియా పెరిగిపోయిందని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైసీపీ అధినేత జగన్ సీరియర్ గా తీసుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డికి ఆ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

జగన్ తో భేటీ తర్వాత….

అయితే ఆనం రామనారాయణరెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావడం, ఇన్ ఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డితో కలసి జగన్ ను కలసి చర్చించడం జరిగిపోయాయి. తాను ఎవరిని ఉద్దేశించి అన్నదో జగన్ కు క్లియర్ గా ఆనం రామనారాయణరెడ్డి తెలిపారట. తనను ఎవరు టార్గెట్ చేస్తుంది? తన కుటుంబానికి పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వారే చేస్తున్న ద్రోహం గురించి జగన్ కు ఆనం రామనారాయణరెడ్డికి వివరించినట్లు తెలిపింది. ” మీ అండ చూసుకునే వారు రెచ్చిపోతున్నారు” అని ఒకింత ఆవేదనతో ఆనం రామనారాయణరెడ్డి జగన్ వద్ద బరస్ట్ అయినట్లు సమాచారం.

ఆనం వాదనతో…..

కనీసం సీనియర్ అన్న గౌరవం కూడా ఇవ్వకుండా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించగా జగన్ కూడా తాను వారితో మాట్లాడతానని, ఏదైనా ఉంటే ఎప్పుడైనా తన వద్దకు వచ్చి నేరుగా చెప్పవచ్చని జగన్ కోరారు. దీంతో పాటుగా ఆనం రామనారాయణరెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా జగన్ తేల్చారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డికి షోకాజ్ నోటీసులు అందుతాయని భావించిన ఆయన వ్యతిరేకుల ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది. మొత్తం మీద ఆనం వ్యవహారాన్ని భేటీతో కొలిక్కి తెచ్చినా నెల్లూరు జిల్లాలో మాత్రం అంత సులువుగా అగ్గి చల్లారదన్నది వాస్తవం.

Tags:    

Similar News