ఆనంకు ఆప్షన్ లేదు.. బ్రాండ్ మారనుందా?

టైం మనది కానప్పుడు టంగ్ స్లిప్ కాకూడదు. అందులోనూ బలమైన నాయకుడు ఉన్న పార్టీలో నోరు మెదపకూడదు. ఈ విషయం సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డికి త్వరగానే [more]

Update: 2020-08-20 05:00 GMT

టైం మనది కానప్పుడు టంగ్ స్లిప్ కాకూడదు. అందులోనూ బలమైన నాయకుడు ఉన్న పార్టీలో నోరు మెదపకూడదు. ఈ విషయం సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డికి త్వరగానే అర్థమయినట్లుంది. అందుకే సైలెంట్ అయ్యారు. ఆనం రామనారాయణరెడ్డి నోరు మెదపడానికి కూడా వీలు లేని పరిస్థితులున్నాయి. ఇప్పడు మంత్రి పదవి దేముడెరుగు.. ఆయన తన నియోజకవర్గం విషయంలోనే టెన్షన్ పడుతున్నారు.

సొంత పార్టీపైనే……

ఆనం రామనారాయణరెడ్డి నిన్న మొన్నటి దాకా పార్టీపై విమర్శలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కలేదన్న ఆక్రోశం కావచ్చు. జూనియర్లు ఎదుగుతున్నారన్న అసహనం కావచ్చు. జగన్ పై కోపం కావచ్చు. వెరసి మొత్తం మీద సొంత పార్టీపై విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఇసుక, క్రికెట్ మాఫియాల గురించి మాట్లాడారు. తన నియోజకవర్గంలో పనులు జరగకుండా అడ్డుకున్న దానిపైనా ప్రశ్నించారు. ఇదంతా స్థానిక మంత్రిని దృష్టిలో పెట్టుకుని చేసిందేనంటారు. వీఆర్ కాలేజీ వ్యవహారంలో మంత్రి అనిల్ లో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోక్యాన్ని ఆనం రామనారాయణరెడ్డి సహించలేక ఇలా అన్నారన్నది వాస్తవం.

తిరుపతి జిల్లాగా ఏర్పడితే…..?

అయితే తాజాగా ఆనం రామనారాయణరెడ్డికి మరో సమస్య పట్టుకుంది. నెల్లూరు జిల్లా బ్రాండ్ గా ముద్రపడిన పేరు ఆనం. ఆనం అంటేనే నెల్లూరు ఠక్కున గుర్తుస్తుంది. కొన్ని దశాబ్దాల పాటు నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబాలు రాజకీయాలు చేశాయి. ఉన్నత పదవులు పొందారు. అలాంటిది ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాకు దూరమయ్యే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నెల్లూరు బ్రాండ్….

వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉంది. పార్లమెంటు నియోజకవర్గాలుగా జిల్లాలు ఏర్పడితే ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహించే వెంకటగిరి తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోతుంది. దీంతో ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాకు దూరమవ్వక తప్పదు. వెంకటగిరిని నెల్లూరు జిల్లాలో కొనసాగించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆనం రామనారాయణ ఎదుట రెండే ఆప్షన్లు. ఒకటి వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలపకుండా చేయగలడం. రెండోది ఆయన వచ్చే ఎన్నికలకు తనకు అచ్చొచ్చిన ఆత్మకూరు నియోజకవర్గానికి వెళ్లడం. ఇలా అయితేనే ఆనం కుటుంబంపై నెల్లూరు బ్రాండ్ ఉంటుంది. లేకుంటే లేదు. ఇందుకోసమే ఆనం రామనారాయణరెడ్డి సైలెంట్ అయ్యారంటున్నారు.

Tags:    

Similar News