anam ramnarayana reddy : ఆనం ఒంటరి అయినట్లేగా?

ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు పార్టీలో ఒంటరయి పోయారు. ఆయనకు వెంకటగిరి నియోజకవర్గంలోనే పార్టీపై పట్టు లేకుండా పోయింది. అయినా భరిస్తూ వస్తున్నారు. వచ్చే మంత్రి వర్గ విస్తరణలో [more]

Update: 2021-09-26 14:30 GMT

ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు పార్టీలో ఒంటరయి పోయారు. ఆయనకు వెంకటగిరి నియోజకవర్గంలోనే పార్టీపై పట్టు లేకుండా పోయింది. అయినా భరిస్తూ వస్తున్నారు. వచ్చే మంత్రి వర్గ విస్తరణలో తనకు ఖచ్చితంగా పదవి లభిస్తుందని ఆనం రామనారాయణరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే అది నెరవేరేలా కన్పించడం లేదు. పార్టీని వీడదామన్నా అవతల టీడీపీ పరిస్థిితి ఏమాత్రం బాగా లేదు. దీంతో ఆయన డైలమాలో ఉన్నారు.

సీనియర్ నేత అయినా….

ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నేత. ఆయన టీడీపీలో నుంచి వైసీపీలోకి 2019 ఎన్నికలకు ముందు వచ్చారు. అయినా జగన్ ఆయనకు వెంకటగిరి టిక్కెట్ ఇచ్చారు. ఆత్మకూరు ఆశించినా అక్కడ మేకపాటి గౌతంరెడ్డి ఉండటతో ఆనంను వెంకటగిరి షిష్ట్ చేశారు. అక్కడ ఉన్న నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని కాదని ఆనంకు చోటు ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆనం దృష్టంతా నెల్లూరు, ఆత్మకూరుపైనే ఉంది. వెంకటగిరి రాజకీయాల్లో పెద్దగా కన్పించడం లేదు.

వెంకటగిరిలో ఒంటరి….

వెంకటగిరిలో అధికారులు సయితం తనకు సహకరించడం లేదని ఆనం రామనారాయణరెడ్డి అనేక సార్లు ఆరోపించారు. అధికారులపై నేరుగా మండిపడ్డారు కూడా. అయితే అక్కడ ఆనం కన్నా ఇతర వైసీపీ నేతలకే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో విసిగిపోయిన ఆనం రామనారాయణరెడ్డి అటు వైపు చూడటమే మానుకున్నారు. ఆయన మొన్నటి వరకూ మంత్రి పదవి దక్కకపోతే తిరిగి టీడీపీలోకి వెళ్లాలని యోచన చేశారంటారు.

తాను వైసీపీలోనే….

టీడీపీలోకి వెళితే ఆనం రామనారాయణరెడ్డి కి ఆత్మకూరు టిక్కెట్ గ్యారంటీ. అయితే ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. నాయకత్వ సమస్య బాగా ఉంది. దీంతో ఆయన పునరాలోచనలో పడ్డారని తెలిసింది. తాను వైసీపీలోనే ఉండటం మంచిదని భావిస్తున్నారు. అయితే తన సోదరుడి కుమారుడు రంగమయూర్ రెడ్డికి మాత్రం టీడీపీలో టిక్కెట్ ఇప్పించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. మొత్తం మీద నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికలకు ముందే రాజకీయాలను మొదలుపెట్టారు.

Tags:    

Similar News