హడావిడి మాత్రమే…ఆచరణలో ఏదీ?

గత నెలఖరులో అగ్రరాజ్యాధినేత ట్రంప్ పర్యటన సందర్బంగా జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. అధినేతల కరచాలనాల ధ్వనులు, ఆలింగనాలు, ఆత్మీయ పలకరింపులు ఇరు దేశాల ప్రజలను [more]

Update: 2020-03-09 16:30 GMT

గత నెలఖరులో అగ్రరాజ్యాధినేత ట్రంప్ పర్యటన సందర్బంగా జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. అధినేతల కరచాలనాల ధ్వనులు, ఆలింగనాలు, ఆత్మీయ పలకరింపులు ఇరు దేశాల ప్రజలను ఆహ్లాద పరిచాయి. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఒప్పందాలు కార్యరుాపం దాల్చగలవని అందరుా ఆశించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్దితి కనిపించింది. కేవలం రక్షణ ఒప్పందం మాత్రమే రుాపుదాల్చింది. 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్రమెాదీ సంతకాలు చేశారు. ముాడు ఎంవోయూ లపైన భారీ ముఖ్య ఒప్పందం మాత్రం అటకెక్కింది. కనీసం కొన్ని ము‌ఖ్య అంశాలపైన ఇరుదేశాలు ఒక అవగాహనకు రాలేక పోయాయి. వాణిజ్య విభేదాల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఒప్పందం కార్య రుాపం దాల్చకపోవడం గమానర్హం. ఈ పరిస్దితికి కరాణాలు ఏంటి? ఉభయుల్లో తప్పు ఎవరిది? అనే అంశాలపై అంతర్జాతీయంగా విస్త్రత చర్చ జరుగుతోంది. ఇరుదేశాల్లో నుా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి లోతుల్లోకి వె‌ళ్లితే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. రెండు దేశాల మద్యగల 1700 కోట్ల వాణిజ్య లోటు ఒప్పందానికి ప్రధాన అడ్డంకి అని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.

వాణిజ్యలోటు కారణంగానే…..

యుద్ధ విమానాలు, ద్రవ రుాప సహజ వాయువు కొనుగోలు ద్వారా ఈ లోటును భర్తీ చేస్తామని భారత్ చెబుతోంది. అయితే ఇందుకు భిన్నమైన వాదనను అగ్రరాజ్యం తెరపైకి తెస్తోంది. ఇతరత్రా ఉత్పత్తుల కొనుగోలు ద్వారా వాటణిజ్య లోటు పుాడ్చాలని వాషింగ్టన్ కోరుతోంది. సుంకాల విషయములో రెండు దేశాల మధ్య తేడాలున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు లో ఒకింత ఎక్కువ. మేధోపరమైన హక్కులు, పాడి ఉత్పత్తులు, కోడికాళ్లు, హార్లీడేవిడ్ సన్ బైకుల కొనుగోలు విషయంలో తీవ్రమైన విభేదాలున్నాయి.

ఇద్దరి వాదనలూ….

అల్యూమినియం, ఉక్కు ఉత్నత్తులపై 2018 లో అమెరికా భారీ సుంకాలు విధించింది. పేద దేశాలకు సంబందించిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP) నుంచి భారత్ ను అమెరికా గత సంవత్సరం తప్పించింది. ఇందుకు నిరసనగా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారీ సుంకాలు భారత్ మెాపింది. దీంతో తమ ఉత్పత్తులను భారత్ లో విక్రయించడం కష్టమని అమెరికా పాడి రైతులు భావిస్తున్నారు. ఇక్కడ భారత్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. శాకాహారాన్ని తీసుకునే ఆవుల ఉత్పత్తులనే తాము కొనుగోలు చేస్తామని విస్పస్టంగా పేర్కొంది. అమెరికా పాడి ఆవులకు మాంసాహారాన్ని దాణాగా పెడుతున్నారని భారత్ అభ్యంతరం చెబుతోంది. భారతియ బీమా, బ్యాంకింగ్ రంగాల్లో 74 శాతం విదేశీ పెట్టుబడులకు ప్రస్తుతం అనుమతి ఉంది విదేశీ వ్యవహారాల్లోనుా పరిమితులు ఉన్నాయి. ఇది వాషింగ్టన్ కు నచ్చడంలేదు. అందుకే వాణిజ్య ఒప్పందానికి దుారంగా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

వేచిచూసే ధోరణిలోనే….

ఇక అమెరికా అమలు చేస్తున్న కఠినతర వీసా నిబంధనలపై భారత్ గుర్రుగా ఉంది. దీనివల్ల ప్రవాస భారతీయులకు, విధ్య, ఉద్యోగాల కోసం వె‌ళ్లే భారతీయ విధ్యార్దులకు ఇబ్బందిగా మారిందని ఎప్పటినుంచో చెబుతోంది. అత్యంత వృత్తి పరమైన నిపుణులకీ H1-B, L1 వీసాలు ఇస్తామనడం వల్ల తమ దేశీయులు నష్టపోతారన్నది న్యుాడిల్లీ వాదన. వీసాల కుదింపునూ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో అమెరికా వాదనను తప్పుపడుతోంది. ఇరు దేశాల అధినేతలకు గల రాజకీయాలు అనివార్యతలు కుాడా వాణిజ్య ఒప్పందానికి అడ్టంగా మారాయన్నది దౌత్యవర్గాల అభిప్రాయం. ఒప్పందం పేరుతో భారత్ కు ఏమాత్రం రాయితీలు ిఇచ్చినా ఈ ఏడాది నవంబరులో జరిగే అభ్యర్దుల ఎన్నికల్లో నష్టపోతాయన్నది ట్రంప్ భావన. అమెరికాకు అనుచిత ప్రయెాజనాలు కల్పించవద్దంటుా వస్తున్న ఒత్తిడులు కుాడా ప్రధాని మెాదీపై పనిచేస్తున్నాయి. అందుకే అధినేతలు ఇద్దరుా వేచిచుాసే దోరణిలో ఉన్నారన్నది విశ్లేషకుల వాదన.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News