బెదిరింపులకు దిగారు… భయపడినట్లు కాదు

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు బెదిరింపులకు దిగడం చర్చనీయాంశమయింది. వైరస్ కట్టడికి ఉపయోగపడుతుందని హైడ్రాక్సిడ్ క్లోరోక్విన్ [more]

Update: 2020-04-08 16:30 GMT

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు బెదిరింపులకు దిగడం చర్చనీయాంశమయింది. వైరస్ కట్టడికి ఉపయోగపడుతుందని హైడ్రాక్సిడ్ క్లోరోక్విన్ మందు ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. కరోనా పై యుద్ధం చేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులు వంటివారికి వైరస్ సోకకుండా ఈ మందు పనికొస్తుందని భావిస్తున్నారు. దాంతో వైద్యులు సూచనలు ఉన్నవారు మాత్రమే దీన్ని వినియోగించు కుంటున్నారు. విశ్వవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం మొదలు పెట్టాకా వైరస్ పై యుద్ధానికి పనికొచ్చే అన్ని మందులను భారత్ ఎగుమతి కాకుండా చెక్ పెట్టింది. దేశంలో ఇవి సరిపడినంత ఉన్నా ముందు జాగ్రత్తగా వీటిని రిజర్వ్ చేసింది మోడీ సర్కార్.

ఇస్తారా లేదా …?

అమెరికాలో కరోనా వైరస్ చేయి దాటిపోయింది. లక్షల్లో పాజిటివ్ కేసులు వేలల్లో మరణాలతో అధ్యక్షుడు ట్రంప్ కి పిచ్చెక్కిపోతుంది. దాంతో ఆయన హైడ్రాక్సిడ్ క్లోరోక్విన్ ను భారత్ తమకు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు ట్రంప్. అయితే దీనికి మోడీ ప్రస్తుత స్థితిలో ఇవ్వలేమని మొదట చేతులు ఎత్తేసింది. దేశవాసులనుంచి, విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలనుంచి తట్టుకోలేక మోడీ ముందుగానే మొహమాటం లేకుండా ట్రంప్ కి సారీ చెప్పేశారు.

తలవొగ్గక తప్పలేదా?

అయితే అగ్రరాజ్య అహంకారి ట్రంప్ ఇలా లాభం లేదని భారత్ పై బెదిరింపులకు దిగారు. మీరు ఆ మందులు ఇస్తారా లేదా ప్రతీకార చర్యలకు దిగమంటారా అని బ్లాక్ మెయిల్ చేశారు. అమెరికాతో భవిష్యత్తు అవసరాల రీత్యా మోడీ కి ట్రంప్ డిమాండ్ కి తలవొగ్గక తప్పలేదు. ప్రస్తుతం యుఎస్ లో ఉన్న పరిస్థితి రీత్యా కూడా మానవతా దృక్పథం తో మందుల ఎగుమతులపై నిషేధం పాక్షిక ఆంక్షలతో ఎత్తివేసింది ఇండియా. దాంతో ఇప్పుడు హైడ్రాక్సిడ్ క్లోరోక్విన్ తో పాటు పారాసిటమాల్ మందులను అమెరికాతో పాటు ఇతర దేశాలకు అందించేందుకు ముందుకు వచ్చింది భారత్.

Tags:    

Similar News