అమెరికా పూర్తిగా చేతులెత్తేసినట్లేనా?

అగ్రరాజ్యం అమెరికా పూర్తిగా చేతులెత్తేసింది. కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయింది. కరోనా వైరస్ మహమ్మారి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికి గుర్తించారు. తమది [more]

Update: 2020-04-01 16:30 GMT

అగ్రరాజ్యం అమెరికా పూర్తిగా చేతులెత్తేసింది. కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయింది. కరోనా వైరస్ మహమ్మారి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికి గుర్తించారు. తమది జీవన్మరణ సమస్యగా ట్రంప్ చెప్పారంటే అమెరికాలో ఏ స్థాయలో కరోనా వైరస్ ఉందనేది చెప్పకనే తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. వచ్చే రెండు వారాలు అమెరికాకు అత్యంత కీలకమని వైట్ హౌస్ ప్రకటించింది.

రెండు లక్షల మంది…..

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ తో వణికిపోతుంది. ప్రధానంగా న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ప్రాంతాలు కరోనా వైరస్ తాకిడికి ఎక్కువగా గురయ్యాయి. ఇక్కడ భవనాలు పక్క పక్కనే ఉండటం, లిఫ్ట్ ల వాడకం వంటివి వైరస్ వ్యాప్తికి కారణాలుగా అధికారులు గుర్తించారు. దాదాపు రెెండు లక్షల మంది అమెరికాలో కరోనా వైరస్ వల్ల మరణించే అవకాశముందని అధికారులు ప్రకటిస్తున్నారంటే పరిస్థితి చేయిదాటి పోయిందనే చెప్పాలి.

ఇప్పుడు మేలుకున్న ట్రంప్….

ఇప్పటికే నౌకలు, స్టేడియాలను, పార్కులను ఆసుపత్రులుగా మారుస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 3900కు చేరుకోవడం ఆందోళన కల్గిస్తుంది. ప్రభుత్వం సూచనలు ఖచ్చితంగా పాటించాలని ట్రంప్ స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని వేడుకుంటున్నారు. కరోనా వ్యాప్తికి ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యమే కారణమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే ట్రంప్ ఆంక్షలు విధించకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపణలు విన్పిస్తున్నాయి.

మరో మూడు నెలలు….

అమెరికా కోలుకోవడానికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో మాస్క్ లు కూడా దొరకడం లేదు. దీంతో కర్చీఫ్ లు కట్టుకోవాలని ట్రంప్ సూచించారు. కాగా అమెరికాలో తెలుగువారు ఎక్కువగా ఉండటంతో వారంతా వాట్సప్ లో గ్రూపులుగా ఏర్పడి క్షేమ సమచారాలను తెలుసుకుంటున్నారు. అమెరికాలో పరిస్థితి భయానకంగా ఉందని తెలుగువారు చెబుతున్నారు. అమెరికాలో ఇప్పటి వరకూ పది లక్షల మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించింది. రోజుకు లక్షమందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెలలో కరోనా కట్టడి కాకపోతే అమెరికా మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News