కెప్టెన్ కు ఫ్రీ “హ్యాండ్”…ఆయనదే అంతా

పంజాబ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్ కు గట్టిగా నమ్మకం లేని రాష్ట్రాలే ఎన్నికలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు పంజాబ్ ఎన్నికల మీద కాంగ్రెస్ [more]

Update: 2021-05-16 17:30 GMT

పంజాబ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్ కు గట్టిగా నమ్మకం లేని రాష్ట్రాలే ఎన్నికలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు పంజాబ్ ఎన్నికల మీద కాంగ్రెస్ గట్టి ఆశలు పెట్టుకుంది. 2017లో జరిగిన మ్యాజిక్ ను తిరిగి రిపీట్ చేయాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భావిస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా అమరీందర్ సింగ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అయింది.

ఐదేళ్ల పాటు….

కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా ఐదేళ్ల పాటు పాలనను సజావుగానే నడిపారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి కాంగ్రెస్ కల్చర్ లో అరుదైన రికార్డు సాధించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తర్వాత ఐదేళ్ల పాటు కొనసాగిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. ఇప్పుడు ముఖ్యమంత్రులన మార్చే కల్చర్ కాంగ్రెస్ లో లేకపోవడంతో కెప్టెన్ కు ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదు.

త్రిముఖ పోటీ…..

117 అసంబ్లీ నియోజకవర్గాలున్న పంజాబ్ రాష్ట్రంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. బీజేపీ ఇప్పటికే తాము అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా ఒంటిరిగానే బరిలోకి దిగనుంది. దీంతో ప్రభుత్వంపై కొద్దో గొప్పో ఉన్న వ్యతిరరేక ఓట్లు ఈ రెండు పార్టీలు చీల్చుకున్నా గెలుపు తమదేనన్న ధీమాతో కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉన్నారు.

పూర్తి స్వేచ్ఛ నిచ్చి…..

కాంగ్రెస్ అధినాయకత్వం కూడా అమరీందర్ సింగ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చేందుకు రెడీ అయింది. అభ్యర్థుల ఎంపిక నుంచి అంతా అమరీందర్ సింగ్ చూసుకుంటారని, ఇందుకోసం స్క్రీనింగ్ కమిటీని నామమాత్రంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ స్వయంగా పంజాబ్ ఎన్నికలను పర్యవేక్షించాలని భావిస్తున్నారు. రైతుల్లో వ్యతిరేతతో మరోసారి తమకు అధికారం గ్యారంటీ అన్న హోప్స్ కాంగ్రెస్ లో బాగానే కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News