అమరీందర్ కు అన్నీ అలా కలసి వస్తున్నాయా?

పంజాబ్ లో మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. 2022 లో ఎన్నికలు జరుగుతాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిది. పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ [more]

Update: 2020-12-14 17:30 GMT

పంజాబ్ లో మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. 2022 లో ఎన్నికలు జరుగుతాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిది. పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ఐదేళ్ల పదవీకాలాన్ని ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుంటారనే చెప్పాలి. మరోసారి అమరీందర్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పంజాబ్ లో ఎన్నికలకు వెళ్లనుంది. అయితే అమరీందర్ కు వరసగా అన్ని కలసి వస్తున్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.

రైతులతో కలసి…..

ప్రధానంగా గత కొద్దిరోజులుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరనసన పంజాబ్ నుంచే ప్రారంభమయింది. అంతకుముందు అమరీందర్ సింగ్ శాసనసభలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. రాహుల్ గాంధీతో కలసి రైతులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. ఇప్పడు ఢిల్లీ శివార్లలో రైతుల ఉద్యమం వెనక కూడా అమరీందర్ ఉన్నారని కేంద్రప్రభుత్వం భావిస్తుంది.

అకాలీదళ్ విడిగా….

ఇటు రైతులు కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉండటం తనకు లాభిస్తుందని అమరీందర్ అంచనా వేస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్ లోని 117 స్థానాల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని బీజేపీ ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనుంది. దీంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎటూ ఒంటరిగానే పోటీ చేస్తుంది.

అంతా మన మంచికేనంటూ….

ఈ లెక్కలన్నీ వేస్తే అమరీందర్ కు మళ్లీ అవకాశాలున్నాయన్న అంచనాలు విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తిరిగి గెలిచేందుకు అమరీందర్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. సిక్కుల్లో జాట్ వర్గానికి చెందిన అమరీందర్ పై హైకమాండ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆయన సారథ్యంలోనే ఎన్నికలు వెళ్లాలని నిర్ణయించింది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు అమరీందర్ సింగ్ కు కలసి వచ్చేటట్లే కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News