స్క్రిప్ట్ అయితే పక్కాగా ఉంది.. మరి సీన్ సితార్ అయితే?

అందరికీ అన్నీ అర్ధమవుతున్నాయి..ఒక్క అమరావతి రైతులకు తప్ప. ఇక్కడ మరో విషయం అసలు రైతులకు కూడా సీన్ పూర్తిగా అవగాహన ఉంది. కానీ ఆందోళనలు చేస్తున్నది రైతుల [more]

Update: 2020-03-09 00:30 GMT

అందరికీ అన్నీ అర్ధమవుతున్నాయి..ఒక్క అమరావతి రైతులకు తప్ప. ఇక్కడ మరో విషయం అసలు రైతులకు కూడా సీన్ పూర్తిగా అవగాహన ఉంది. కానీ ఆందోళనలు చేస్తున్నది రైతుల ముసుగులో ఉన్న కొంతమంది కామందులు, పెత్తందార్లు కాబట్టి. అర్ధమైనా మొద్దు నిద్ర నటిస్తున్నారని. ఇప్పటికి దాదాపు ఎనభై రోజులుగా అమరావతి రాజధాని అంటూ గొంతు చించుకున్నా పొరుగున ఉన్న జిల్లాలకే కాక పుట్టలేదు. మరి ఏపీ మొత్తానికి బీపీ వస్తుందని, ఢిల్లీ, గల్లీ ఏకమవుతాయని రైతులు ఎలా ఊహించుకుంటున్నారు. అంటే అది పిడివాదం, మొండితనమైనా అయి ఉండాలి. లేకపోతే ఏదో రాజకీయమైనా అయి ఉండాలి. చూడబోతే రెండవదే కరెక్ట్ అని ఇపుడు గట్టిగా భావన బలపడుతోంది.

మందు ఒకచోట….

నిజానికి రాజధాని కావాలన్నా, లేక తమ సమస్య సానుకూలం కావాలన్నా కూడా రైతులు చేయాల్సిన పని ప్రభుత్వంతో చర్చలు జరపడం. ఇప్పటికి మూడు నెలలు అవుతున్నా ఆ పని చేయకుండా కనపడిన ప్రతీ వారినీ పట్టుకుని రాజధాని ఇక్కడే ఉంచండి అంటున్నారంటేనే అందులో రాజకీయం ఉందని తెలిసిపోతోంది. ఇక వచ్చిన పార్టీలు, నాయకులు కూడా తోచిన విధంగా మాటలు చెబుతూ రెచ్చగొడుతున్నారు తప్ప చేసేదేమీ లేదు. ఇవన్నీ మొత్తం ప్రపంచానికి అర్ధమవుతున్నాయి. ఇంకోవైపు కేంద్రం జోక్యం చేసుకోవాలని, అంతర్జాతీయ న్యాయస్థానం సాయం చేయాలని లేనిపోని మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ఫక్తు పాలనా నిర్ణయం….

నిజానికి రాజధానులు ఎక్కడ, ఎలా ఉండాలి, ఎన్ని ఉండాలి అన్నది ఫక్తు పాలనపరమైన నిర్ణయం. ఇందులో రాష్ట్రాలకే అధికారాలు ఉంటాయి తప్ప కేంద్రం జోక్యం ఉండదని ఓ వైపు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. మరో వైపు బీజేపీ జాతీయ నాయకులు కూడా అదే మాట వల్లిస్తున్నారు. కానీ చెవికి ఎక్కడంలేదే. తాజాగా ఇదే విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మళ్ళీ చెప్పుకొచ్చారు. ఆయన ఈసారి ఏపీ బీజేపీ నాయకుల వైఖరిని కూడా తప్పుపట్టారు. కేంద్రానికి ఇందులో ఏం సంబంధం అని కూడా ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ లో రెండవ రాజధానిని పెట్టుకుంటున్నారని చెబుతూ ఆయన‌ బీజేపీ పాలిత రాష్ట్రాన్ని కూడా ఉదహరించారు. ఇక అమరావతి రైతులు ప్రభుత్వంతోనే చర్చలు జరుపుకోవాలని కూడా సూచించారు.

టీడీపీ వల్లనే…..

అయితే అమరావతి రాజధాని కధ మొత్తం తెర వెనకాల స్క్రిప్ట్ టీడీపీదేనని వైసీపీ ఆరోపిస్తోంది. చూస్తూంటే ఇపుడు అదే నిజం అనిపిస్తోంది. ఎందుకంటే నిజమైన రైతులు అయితే ఇన్నాళ్ళు పట్టుపట్టి బిగదీసుకుని కూర్చోరు. ఇక్కడ టీడీపీ ఆడిస్తోంది కాబట్టి పెత్తందార్లు ఒక్కటై అలా వైసీపీ మీద బురద జల్లుతున్నారని అంటున్నారు. నిజానికి వారికి కూడా తెలుసు. మూడు రాజధానుల నిర్ణయం ఆగదని, కానీ లోకల్ బాడీఎన్నికల వరకైనా ఈ ఆందోళన‌ కొనసాగించి ఈ వేడిలో టీడీపీని చలి కాచుకోనివ్వాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నంగా ఉందంటున్నారు. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక వైసీపీకే అనుకూలంగా ఫలితాలు వచ్చినా మెజారిటీ సీట్లు అధికార పార్టీకి వచ్చినా సీన్ సితార అవుతుంది. అది ఏమైనా ఆలోచించారా. ఇప్పటికైనా జరిగేది, జరగబోయేది అర్ధమవుతోందా అంటున్నారంతా.

Tags:    

Similar News