ఆమంచికి అదో రకం చెక్

మంగ‌ళ‌వారం నాటి శాస‌న మండ‌లి స‌మావేశంలో జ‌రిగిన ఒక అనూహ్యమైన ప‌రిణామం. ప్రకాశం జిల్లా రాజ‌కీయాల్లో పెను కుదుపునకు కార‌ణ‌మైంది. ముఖ్యంగా అధికార ప‌క్షం వైసీపీలో పెను [more]

Update: 2020-01-23 15:30 GMT

మంగ‌ళ‌వారం నాటి శాస‌న మండ‌లి స‌మావేశంలో జ‌రిగిన ఒక అనూహ్యమైన ప‌రిణామం. ప్రకాశం జిల్లా రాజ‌కీయాల్లో పెను కుదుపునకు కార‌ణ‌మైంది. ముఖ్యంగా అధికార ప‌క్షం వైసీపీలో పెను సంచ‌ల‌నానికి దారితీసింది. ప్రస్తుతం రాజ‌ధాని విష‌యం హాట్ టాపిక్‌గా మారిన నేప‌థ్యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప్రతి ఒక్కరూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అసెంబ్లీలో బ‌లం త‌క్కువ‌గా ఉన్న టీడీపీ రాజ‌ధాని విష‌యంలో ఒకింత వెనుక‌డుగు వేసింది. రాజ‌ధానిగా కేవ‌లం అమ‌రావ‌తి మాత్రమే ఉండాల‌ని, టీడీపీ సిద్ధాంతం. 'ఒక రాష్ట్రం- ఒక రాజ‌ధాని' అని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేయ‌డంతోపాటు రాజ‌ధాని కోసం రోడ్డెక్కిన వాతావ‌ర‌ణం కూడా చూశాం. ఇక‌, అధికార పార్టీ దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో నెగ్గించుకుని బ‌య‌ట‌ప‌డింది.

విప్ ను థిక్కరించి….

కానీ, శాస‌న మండ‌లి విష‌యానికి వ‌స్తే.. వైసీపీకి కేవ‌లం 9 మంది మాత్రమే బ‌లం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక్కడ పార్టీ వెన‌క్కి త‌గ్గాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఉండే జంపింగుల‌కు ఇక్కడ అవ‌కాశం ఇచ్చిన‌ట్టయింది. ఈ క్రమంలోనే టీడీపీకి హార్డ్ కోర్ నాయ‌కురాలిగా పేరున్న పోతుల సునీత ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు. అయితే, ఆమె టీడీపీ విప్ జారీ చేసిన త‌ర్వాత కూడా టీడీపీ ప‌రిధి దాటి వైసీపీకి అనుకూలంగా మండ‌లిలో మంగ‌ళ‌వారం ఓటేశారు. దీంతో ఒక్కసారిగా టీడీపీలో క‌ల‌క‌లం రేగింది. త‌మ మాట‌నే ధిక్కరిస్తారా? అంటూ అదినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఈ క్రమంలో ఆమెపై చ‌ర్యలు కోరుతూ.. మండ‌లి చైర్మన్ ఫిర్యాదు చేయ‌నున్నారు.

శాసనసభలోకి వెళ్లాలన్నది…..

ఈ విష‌యాన్ని ప‌క్కన పెడితే… కీల‌క‌మైన స‌మ‌యంలో వైసీపీకి మ‌ద్దతిచ్చిన పోతుల సునీత‌కు జ‌గ‌న్ రుణం ఎలా తీర్చుకుం టారు? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో ఆమె గ‌తంలో పొటీ చేసి ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గంపై ఒక్కసారిగా అంద‌రి దృష్టి ప‌డింది. ఆమెకు శాస‌న‌స‌భ‌లోకి వెళ్లాల‌నేది చిర‌కాల వాంఛ‌. గ‌తంలో ఈ విష‌యాన్ని ఆమె బ‌హిరంగంగా కూడా చెప్పారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో పోటీ చేసి హోరా హోరీ త‌ల‌ప‌డిన ఆమె అప్పట్లో స్వతంత్ర అభ్యర్ర్థిగా రంగంలోకిదిగిన ఆమంచి కృష్ణమోహ‌న్‌ను ఉక్కిరిబిక్కిరి గురి చేశారు. తీరా ఆమంచే విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆయ‌న టీడీపీలోకి రావ‌డం ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు మ‌ళ్లీ వైసీపీలోకి వెళ్లడం తెలిసిందే.

హామీ ఏంటి…?

ఒకానొక సంద‌ర్భంలో ఆమంచి కృష్ణమోహన్ త‌న‌కు పోటీ వ‌స్తాడ‌ని భావించి ఆయ‌న రాక‌ను పోతుల సునీత తీవ్రంగా విమ‌ర్శించారు. అడ్డుకున్నారు కూడా. అయితే, 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఆమంచి మ‌ళ్లీ వైసీపీ గూటికి చేరిపోవ‌డంతో ఆమె ఊపిరి పీల్చుకున్నా.. టికెట్‌ను మాత్రం ద‌క్కించుకోలేక పోయారు. ఇక‌, 2014లో ఓట‌మి త‌ర్వాత చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆమె అనూహ్యంగా వైసీపీకి మ‌ద్దతుగా ఓటేశారు. అంటే దాదాపు వైసీపీలోకి చేరిపోయిన‌ట్టే. లేదా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చీరాల టికెట్‌పై అయినా గ‌ట్టి భ‌రోసా ల‌భించి ఉండాల‌నే ప్రచారం జ‌రుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ వైసీపీకి ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు.

టెన్షన్ లో ఆమంచి….

అయితే, ఆయ‌న కుటుంబ వ్యవ‌హారంతో విసుగెత్తిన సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌కు ఇప్పటికే రెండు సార్లు వార్నింగ్ ఇచ్చార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా సునీత వైసీపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రించ‌డంతో ఆమెకు వైసీపీ నుంచి గ‌ట్టి హామీ లేకుండా ఇలా ఎందుకు చేస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇది నిజ‌మే అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమంచికి ఇక్కడ టికెట్ ఎగిరిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చీరాల‌లో ప‌ద్మశాలీ వ‌ర్గం ఓట‌ర్లు 70 వేల వ‌ర‌కు ఉన్నారు. సునీత ఆ వ‌ర్గానికి చెందిన వారే. ఆమంచి వర్గం అయిన కాపు వ‌ర్గం ఓట‌ర్లు అక్కడ త‌క్కువే.. అయినా ఆయ‌న రెండు సార్లు గెలిచారు. ఇక చీరాల‌లో ఆమంచికి చెక్ పెట్టేందుకే జ‌గ‌న్ సునీత‌ను పార్టీలో చేర్చుకున్నార‌నే వైసీపీ వ‌ర్గాలు కూడా ధృవీక‌రిస్తున్నాయి. ఇదే విష‌యంపై ఆమంచి వ‌ర్గంలోనూ క‌ల‌క‌లం రేగింది. ప‌చ్చగ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నే ఈ రెండు వ‌ర్గాల రాజ‌కీయం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News