ఆమంచి అంతా మంచికేనా?

ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో ప్రతిపక్షం లేదు. అంతా అధికార పక్షమే. గెలిచిన ఎమ్మెల్యే కరణం బలరాం సయితం జగన్ ను కలసి మద్దతు ప్రకటించడంతో ఆయన కూడా [more]

Update: 2020-03-12 14:30 GMT

ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో ప్రతిపక్షం లేదు. అంతా అధికార పక్షమే. గెలిచిన ఎమ్మెల్యే కరణం బలరాం సయితం జగన్ ను కలసి మద్దతు ప్రకటించడంతో ఆయన కూడా వైసీపీలో అనధికారికంగా చేరినట్లే. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సయితం కొద్దిరోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. చీరాల నియోజకవర్గంలో పోతుల సునీత, కరణం బలరాం టీడీపీ నాయకులుగా ప్రస్తుతం ఉన్నారు. వారిద్దరూ పార్టీని వీడటంతో ఇప్పుడు ఆ పార్టీలో సరైన నేత లేడనే చెప్పాలి. వైసీపీ లో ఆమంచి కృష్ణమోహన్ ఆల్ రెడీ ఉన్నారు.

అందరూ వైసీపీలో చేరడంతో…..

ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం చీరాల వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. కరణం బలరాం కూడా అనధికారికంగా వైసీపీలో చేరిపోవడంతో ఇప్పుడు చీరాల నియోజవకర్గంలో పరిస్థితి వన్ సైడ్ గా మారాల్సి ఉంది. నిజానికి కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ బద్ధ శత్రువులు. గత ఎన్నికల్లో ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశారు. నిన్నటి వరకూ కరణం బలరాం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ హవా అధికారుల వద్ద నడిచింది.

అద్దంకి హామీతో….

అయితే ఇప్పుడు జగన్ నుంచి కరణం కుటుంబానికి అద్దంకి టిక్కెట్ హామీ లభించింది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేష్ ను అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి రెడీ అవుతున్నారు. కరణం బలరాం రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని భావిస్తున్నారు. కుమారుడి భవిష్యత్తు కోసం ఆయన రాజకీయంగా రాజీ పడ్డారంటున్నారు. అందుకోసమే ఈసారి అద్దంకి టిక్కెట్ ను కరణం వెంకటేష్ కు ఇచ్చేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల నాటికి….

దీంతో ఆమంచి కృష్ణమోహన్ కు వచ్చిన నష్టమేమీ లేదు. కరణం వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ కారు. అలాగే పోతుల సునీత కూడా వైసీపీలోనే ఉన్నారు. అందుకే ఆమంచి కృష్ణమోహన్ కరణం బలరాం రాకను పెద్దగా వ్యతిరేకించ లేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కరణం బలరాం ఉండటంతో ఇన్ ఛార్జి పదవిలో ఆమంచి కృష్ణమోహన్ కొనసాగుతారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ఆమంచి కృష్ణమోహన్ విషయంలో మాత్రం అంతా ఆయన మంచికే జరుగుతుందన్న వ్యాఖ్యలు పార్టీ అగ్రనేతల నుంచి విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News