జగన్ తెగ్గొట్టారు…ఇద్దరూ ఒక్కటయినట్లే 

చీరాల పంచాయతీకి జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలపడం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీ [more]

Update: 2020-03-17 14:30 GMT

చీరాల పంచాయతీకి జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలపడం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీ కండువా కప్పుకోవడంతో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వర్గంలో ఆందోళన నెలకొంది. తమ నేతను జగన్ ఎక్కడ సైడ్ చేస్తారో?నని కంగారు పడుతున్నారు. అయితే ఆమంచి వర్గీయులకు జగన్ చల్లని కబురు చెప్పారు. కరణం బలరాం తనను కలిసిన వెంటనే ఆమంచి కృష్ణమోహన్ కు జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి కబురు వెళ్లింది.

కరణం కలిసిన వెంటనే…..

చీరాల నుంచి హుటాహుటిన జగన్ ను ఆమంచి కృష్ణమోహన్ కలిశారు. కరణం బలరాం కుమారుడు వెంకటేష్ ను ఎందుకు చేర్చకుందీ ఆమంచి కృష్ణమోహన్ కు జగన్ వివరించినట్లు తెలిసింది. తొలుత కరణం బలరాం చీరాలలో సమావేశం పెట్టుకుని వైసీపీకి మద్దతు తెలపాలని నిర్ణయం వెలువడించిన వెంటనే ఆమంచి కృష్ణమోహన్ అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డితో మాట్లాడారు.

ఆమంచిని పిలిచి మరీ….

తన దారి తాను చూసుకోమంటారా? అని ఆమంచి కృష్ణమోహన్ మంత్రి బాలినేని వద్ద కొంత తీవ్ర స్వరంతోనే అన్నట్లు సమాచారం. ీదీంతోనే వెంటనే ఆమంచి కి జగన్ నుంచి కబురు వచ్చిందంటున్నారు. నిజానికి పదినెలల క్రితమే ఆమంచి కృష్ణమోహన్ కు, కరణం బలరాంకు మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఎన్నికలరోజు, ఆ తర్వాత కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కరణం బలరాం ఎక్కడికి వచ్చినా ఆమంచి వర్గీయులు అడ్డుకోవడం చీరాలలో సాధారణంగా మారిపోయింది.

ఇద్దరూ కలసి…..

ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతలు కలసి పనిచేయాలని జగన్ ఆదేశించారు. కరణం బలరాంను తాను అద్దంకి నేతగానే చూస్తానని, చీరాల ఎమ్మెల్యేగా చూడనని జగన్ చెప్పడంతో ఆమంచి చల్ల బడ్డారు. ఐదారు నెలలు మాత్రం కలసి పనిచేయాలని జగన్ ఆమంచి కృష్ణమోహన్ కు సూచించినట్లు తెలిసింది. అద్దంకి నియోజకవర్గానికి కరణం వెంకటేష్ ను ఇన్ ఛార్జిగా నియమించిన తర్వాత కరణం అద్దంకిపై దృష్టి పెడతారని కూడా జగన్ హామీ ఇచ్చారంటున్నారు. దీంతో కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ లు కలసి పనిచేయాలని నిర్ణయించారు.

Tags:    

Similar News