బ్రేకింగ్ : ఢిల్లీ సుల్తాన్ కేజ్రీ

ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. తిరిగి అరవింద్ కేజ్రీవాల్ దే విజయం అని [more]

Update: 2020-02-08 13:24 GMT

ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. తిరిగి అరవింద్ కేజ్రీవాల్ దే విజయం అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి అఖండ విజయం ఖాయమని తేల్చేశాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈ నెల 11వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఢిల్లీ సుల్తాన్ గా తిరిగి కేజ్రీవాల్ కానున్నారని తేల్చాయి.

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ 44, బీజేపీ 26 స్థానాలు గెలుచుకుంటాయని అంచనా వేశాయి.

రిపబ్లిక్ టీవీ సర్వేలో 44 నుంచి 61 స్థానాల్లో ఆప్ విజయం సాధిస్తుంది. బీజేపీ 9 నుంచి 21 స్థానాల్లో విజయం సాధిస్తుంది.

టైమ్స్ నౌ 44 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుండగా, బీజేపీ 26 స్థానాలను కైవసం చేసుకుంటుంది

న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం 53 నుంచి 57 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 11 నుంచి 15 స్థానాల్లో బీజేపీ గెలవనుంది.

ఇండియా టీవీ సర్వేలో 46 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 24 స్థానాల్లో బీజేపీ గెలవనుందని తేల్చింది.

సుదర్శన్ న్యూస్ 40 నుంచి 44 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 20 నుంచి 28 స్థానాల్లో బీజేపీ గెలవనుంది.

Tags:    

Similar News