ఆళ్ల సైలెంట్ అయింది అందుకేనా?

ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఇందుకు కారణాలు పెద్దగా లేకపోయినా ఆయనపై వైసీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. రాజధాని అమరావతి రైతులను ముఖ్యమంత్రి [more]

Update: 2020-06-13 13:30 GMT

ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఇందుకు కారణాలు పెద్దగా లేకపోయినా ఆయనపై వైసీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. రాజధాని అమరావతి రైతులను ముఖ్యమంత్రి జగన్ వద్దకు తీసుకు వచ్చని సందర్భంలో మాత్రమే ఆళ్ల రామకృష్ణారెడ్డి కన్పించారు. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగై పోయారు. మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంటున్నప్పటికీ ఆయన మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు.

విపక్షంలో ఉన్నప్పుడు…..

నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార తెలుగుదేశం పార్టీని ఒక ఆటాడుకున్నారు. కోర్టుల్లో కేసులు వేశారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ అప్పట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్లు దాదాపు సెంచరీని దాటేశాయంటారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ పై గెలిచి సంచలనం సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఊరుకోలేదు.

నాలుగు నెలల నుంచి…..

కరకట్టపై ఉన్న చంద్రబాబు ఉంటున్న భవనం అక్రమ నిర్మాణమంటూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. అంతేకాదు ప్రభుత్వం వెంటనే అక్రమ కట్టడాలు కూల్చివేయాలంటూ రోజుకో మీడియా సమావేశం పెట్టేవారు. కరకట్ట మీద ఎన్ని ఆక్రమణలు ఉన్నాయో ఆళ్ల రామకృష్ణారెడ్డి నివేదిక రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే గత నాలుగు నెలలుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి కన్పించడం మానేశారు. తమ ఇంట్లో వివాహం ఉందని చెప్పి నాలుగు నెలల క్రితం చెప్పిన ఆయన కరోనా తర్వాత అసలు కానరావడం లేదు.

ఆయనకు ఆ పదవి రావడంతో….

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తుండటంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. అంతేకాకుండా వచ్చే మంత్రి వర్గ విస్తరణలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కి అవకాశం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని తెలియడంతో ఆయన ఒకింత సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి మౌనంపై సోషల్ మీడియాలో అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News