ఆళ్ల అయితా..పయితా లేరే

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పుడూ దూకుడుగా ఉంటారు. ముఖ్యంగా మంగళగిరి ప్రాంతం నుంచి రెండుసార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వలేదు. కేసులతో అప్పటి ప్రభుత్వాన్ని [more]

Update: 2019-12-21 09:30 GMT

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పుడూ దూకుడుగా ఉంటారు. ముఖ్యంగా మంగళగిరి ప్రాంతం నుంచి రెండుసార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వలేదు. కేసులతో అప్పటి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా అధికార పార్టీ పై కేసులు వేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసం అక్రమమంటూ పలు కేసులను వేసి టాక్ ఆఫ్ ది అమరావతిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు తెచ్చుకున్నారు.

కొద్దిరోజులుగా…..

అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయిపోయారు. శాసనసభ సమావేశాలు చివరి రోజున జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితా పయితా లేకుండా పోయారు. అమారావతిలో కేవలం అసెంబ్లీ, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, రాజ్ భవన్ మాత్రమే ఉంచాలని జీఎన్ రావు కమిటీ ఇప్పటికే జగన్ కు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నివేదికపై ఈ నెల 27వ తేదీన నిర్ణయం తీసుకోనున్నారు.

నిరసనలు వెల్లువెత్తుతున్నా….

ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన 29 గ్రామాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు, కూలీలు, మహిళలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగతున్నారు. అయినా ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం పత్తా లేరు. నిత్యం తన కార్యాలయంలో ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత మూడు రోజు లనుంచి కార్యాలయానికి కూడా రావడం లేదు. ఆయన స్పందన కోసం ఇటు వైసీపీ కార్యకర్తలతో పాటు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు.

ఆయన కోసం ఎదురు చూపులు….

ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు సయమంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి అలజడి సృష్టించారు. నిజానికి మూడు రాజధానుల ప్రతిపాదనతో ఎక్కువ గా నష్టపోయేది ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే. రాజధాని అమరావతి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో భూముల ధరలతో పాటు వ్యాపారాలు కూడా పెరిగాయి. ప్రజల ఆర్థిక స్థోమత కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో మంగళగిరి ప్రజల పక్షాన ఆళ్ల రామకృష్ణారెడ్డి నిలుస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో ఆళ్ల దీని ప్రతిపాదనపై నోరు మెదపకపోవచ్చని కూడా అంటున్నారు. మొత్తం మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారారు.

Tags:    

Similar News