వైసీపీలో ఆళ్ల నాని కొత్త రాజ‌కీయం ?

ప‌శ్చిమ వైసీపీలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సొంత పార్టీలోనే స‌రికొత్త రాజ‌కీయం ప్రారంభించారా ? అంటు అవున‌నే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. [more]

Update: 2021-02-28 12:30 GMT

ప‌శ్చిమ వైసీపీలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సొంత పార్టీలోనే స‌రికొత్త రాజ‌కీయం ప్రారంభించారా ? అంటు అవున‌నే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనుంగు అనుచ‌రుడిగా పేరున్న ఆళ్ల నాని 1999 నుంచి ఏలూరు కేంద్రంగా రాజ‌కీయం చేస్తున్నారు. ఈ రెండు ద‌శాబ్దాల రాజ‌కీయంలో ఆయ‌న మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఓడిపోయారు. ఆయ‌న ఎప్పుడూ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌నేంటో తాను చూసుకుంటారే త‌ప్ప ఇత‌రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌న్నెత్తి కూడా చూడ‌ర‌ని పేరుంది. అయితే ఇప్పుడు మాత్రం ఆళ్ల నాని త‌న స‌హజ శైలీకి భిన్నంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని.. జిల్లాలో ప‌ట్టుకోసం పాకులాడ‌డంతో పాటు ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది.

ఇతర నియోజకవర్గాల్లో…..

1994లో కాంగ్రెస్ సీటు ఆశించి భంగ‌ప‌డ్డ ఆళ్ల నాని ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడారు. 1999లో వైఎస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన ఆళ్ల నాని 2004లో తొలిసారి ఏలూరు ఎమ్మెల్యే అయ్యారు. 2009లో వ‌రుస‌గా రెండోసారి గెలిచాక వైఎస్ మ‌ర‌ణాంత‌రం వైసీపీలో చేరి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవ‌హ‌రించారు. 2014లో ఆళ్ల నాని ఓడినా జ‌గ‌న్ ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఏనాడు ఇత‌రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలు పెట్టడం కాని.. సొంత పార్టీలోనే ఇత‌ర నేత‌ల‌ను ఎంక‌రేజ్ చేయ‌డం కాని ఎప్పుడూ చేయ‌లేదు.

కొందరిని ఎంకరేజ్ చేస్తూ…..

అయితే ఈ సారి మాత్రం త‌నకు సొంత పార్టీలోనే ఎదురొచ్చే నేత‌లు లేదా పోటీ వ‌స్తార‌నుకున్న నేత‌లకు ( అధిష్టానం ద‌గ్గర గుర్తింపు ప‌రంగా జ‌గ‌న్ దృష్టిలో ముందున్నవారు) ఆయ‌న చాప‌కింద నీరులా ఎర్త్ పెడుతున్నార‌ట‌. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగాను కొంద‌రిని ఎంక‌రేజ్ చేస్తుండ‌డంతో పాటు జిల్లా అంత‌టా త‌న వ‌ర్గాన్ని బాగా ప్రోత్సహిస్తోన్న ప‌రిస్థితి ఉంద‌ని వైసీపీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లాలో ఓ సామాజిక వ‌ర్గంలో త‌మ పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌ల‌కే ఆయ‌న ప్రయార్టీ ఎక్కువుగా ఉంటోంద‌ని మిగిలిన వర్గాల నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. జిల్లాకే చెందిన ఓ ఎంపీతోనూ ఆయ‌న‌కు పెద్ద స‌ఖ్యత లేద‌ని.. ఈ క్రమంలోనే పార్టీలోనే త‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓ బీసీ నేత‌ను ఆయ‌న ఎంక‌రేజ్ చేస్తూ ఆ ఎంపీ పార్లమెంటు ప‌రిధిలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల ద్వారా ఆయ‌న్ను ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా చేప‌ట్టార‌ని పార్టీలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తోన్న వారు చెబుతున్నారు.

ఎంపీకి వ్యతిరేకంగా….

మెట్ట ప్రాంతంలో ఆ ఎంపీతో స‌ఖ్యత లేని ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు మంత్రి ఆళ్ల నాని తో స‌ఖ్యత‌తో ఉంటున్నారు. అంతే కాకుండా ఎంపీకి పోటీగా తాను ఎంక‌రేజ్ చేస్తోన్న ఆ బీసీ నేత ( యాద‌వ సామాజిక వ‌ర్గం) నేత‌ను ఎమ్మెల్యేల‌కు, ఎమ్మెల్యేల వ‌ర్గంతో బాగా అటాచ్‌మెంట్ కుదురుస్తున్నార‌ట‌. డెల్టాలో బ‌లంగా ఉన్న వైసీపీ నేత‌ల్లో కూడా కొంద‌రిని మాత్రమే ఆయ‌న త‌న వ‌ర్గం నేత‌లుగా ప్రోత్సహించుకుంటోన్న ప‌రిస్థితి ఉంది. జిల్లా నుంచి మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల నానికి వ‌చ్చే కేబినెట్ ప్రక్షాళ‌న‌లో కూడా మంత్రి ప‌ద‌వికి ఢోకా లేద‌న్న ధీమా ఆయ‌న‌లో ఉంద‌ని, ఈ క్రమంలోనే జిల్లాలో త‌న వ‌ర్గాన్ని ప‌టిష్టం చేసుకుంటూ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అన్ని విధాలా త‌న‌దే పైచేయి ఉండేలా పునాది వేసుకుంటున్నార‌ని టాక్ ? అయితే ఎంత చాప‌కింద నీరులా సొంత పార్టీలో రాజ‌కీయం చేస్తున్నారో ? అంతేలా పార్టీలో సైలెంట్‌ గ్రూపులు పెరుగుతున్నాయి. మ‌రి ఇది ఎటు దారితీస్తుందో ? చూడాలి.

Tags:    

Similar News