ఆళ్ల నానికి ఆ అవార్డు ఇవ్వాల్సిందేనట

వైసీపీ మంత్రుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ సాగింది. జ‌గ‌న్ కేబినెట్‌లో అత్యుత్తమ మంత్రి అవార్డు ప్రవేశ పెడితే.. అది ఎవ‌రికి ఇవ్వాలి..! అనే చ‌ర్చ సాగింది. నిజ‌మే.. [more]

Update: 2021-05-12 08:00 GMT

వైసీపీ మంత్రుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ సాగింది. జ‌గ‌న్ కేబినెట్‌లో అత్యుత్తమ మంత్రి అవార్డు ప్రవేశ పెడితే.. అది ఎవ‌రికి ఇవ్వాలి..! అనే చ‌ర్చ సాగింది. నిజ‌మే.. జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేప‌థ్యంలో ఏ మంత్రికి ప‌ని ఎక్కువ‌గా ఉంది ? ఎవ‌రు ఎక్కువ‌గా ప‌నిచేస్తున్నారు ? ఎవ‌రు విమ‌ర్శల‌కు అతీతంగా ప‌నిని మాత్రమే న‌మ్ముకునిముందుకు సాగుతున్నారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. కేవ‌లం ఒకే ఒక మంత్రికి ప‌ని ఎక్కువ‌గా ఉంద‌ని స్పష్టమైంద‌ని అంటున్నారు. ఆయ‌న ప‌నితీరుకు సీఎం జ‌గ‌న్ కూడా మంచి మార్కులే వేస్తున్నార‌ని చెబుతున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తితో….?

ఇంత‌కీ ఆ మంత్రి ఎవ‌రో కాదు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ ఆళ్లనాని. ఆయ‌న‌కు ఏ ముహూర్తాన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యత‌లు అప్పగించారో.. కానీ.. బాధ్యత‌లు తీసుకున్న ఆరు మాసాల‌కే చేతినిండా ప‌నిదొరికింది. దేశంలో క‌రోనా ఎంట్రీతో ఈ మంత్రిగారికి భారీ ఎత్తున ప‌ని దొరికింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలిద‌శ‌లో క‌రోనా విజృంభ‌ణ‌ను అడ్డుకునేందుకు, ప్రజ‌ల‌ను ర‌క్షించేందుకు ఆళ్ల నాని బాగానే శ్రమించారు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ ఆయ‌న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప‌ర్యటించి.. వైద్యుల‌తో చ‌ర్చలు జ‌రిపి.. రోగుల‌కు స‌రైన వైద్యం అందేలా చ‌ర్యలు తీసుకున్నారు.

సెకండ్ వేవ్ తో…..

అదే స‌మ‌యంలో కేంద్రంతోనూ మానిట‌రింగ్ చేసుకున్నారు. ఫ‌లితంగా తొలి వేవ్‌ను ఒకింత విజ‌య‌వంతంగా పూర్తి చేశార‌నే పేరు తెచ్చుకున్నారు. హ‌మ్మయ్య! ఇక రెస్ట్ ల‌భించింది!! అని ఆళ్ల నాని ఊపిరి పీల్చుకునే స‌రికి.. గోరుచుట్టుపై రోక‌లి పోటు మాదిరిగా .. త‌న సొంత జిల్లాలో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఏలూరులో వింత వ్యాధి ప్రజ‌ల‌ను ఉక్కిరిబిక్కిరికి గురిచేసింది. దీంతో హుటాహుటిన ఆయ‌న రంగంలోకి దిగి నిద్రాహారాలు మానేసి మ‌రీ.. మానిట‌రింగ్ చేయాల్సి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లోనూ ఇదే స‌మ‌స్య వెంటాడింది. దీంతో మంత్రిగారికి రెస్ట్ లేకుండా పోయింది. విదేశీ వైద్యుల‌ను కూడా ర‌ప్పించి.. ఇక్కడ వాట‌ర్‌, గాలి, తేమ వంటి అనేక ప‌రీక్షలు చేయించారు. వింత వ్యాధి దాదాపు రెండు వారాల‌పాటు.. మంత్రికి కంటిపై కునుకు లేకుండా చేసింది.

సంయమనం కోల్పోకుండా…?

ఇక‌, ఇది కొంత త‌గ్గుముఖం ప‌ట్టిందిలే.. అనుకునే స‌మ‌యానికి ఇప్పుడు.. క‌రోనా సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. దీంతో గ‌డిచిన 20 రోజులుగా మ‌ళ్లీ మంత్రి ఆళ్ల నానికి నిద్రలేకుండా పోయింద‌ని టాక్‌. ఆయ‌న నిత్యం స‌మీక్షలు, కొవిడ్ వ్యాధిగ్రస్తుల‌కు వైద్యం అందించే విధానంపై మానిట‌రింగ్‌, వైద్యులను నియ‌మించ‌డం, వ‌లంటీర్ల సేవ‌లు.. ఇలా అనేక రూపాల్లో ఆయ‌న నిత్యం బిజీగా ఉంటున్నారు. ఇక‌, ఇదిలాసాగుతున్న క్రమంలో ఆక్సిజ‌న్ కొర‌త, ప్రైవేటు వైద్యశాల‌ల దోపిడీ వంటి మంత్రికి మ‌రింత చికాకు తెప్పించాయి. అయిన‌ప్పటికీ.. ఎక్కడా సంయ‌మ‌నం కోల్పోకుండా .. మంత్రి ఆళ్లనాని వ్యవ‌హ‌రిస్తుండ‌డంపై మంత్రివ‌ర్గంలోని మినిస్టర్ మిత్రులు ఆయ‌న‌ను పొగ‌డ్తల‌తో ముంచెత్తుతున్నార‌ట‌! ఈ క్రమంలోనే 'మినిస్ట‌ర్ ఆఫ్ ది జ‌గ‌న్ కేబినెట్‌'.. అవార్డు క‌నుక ఉంటే ఆయ‌న‌కే ఇవ్వాల‌ని అని.. వైసీపీలో గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News