అయోధ్యా…. ? ఇదేందయ్యా?

రాజ్యసభ పదవి అనేది అందరికీ దక్కదు. ఆ అరుదైన అవకాశం కొందరికే దక్కుతుంది. అలాంటి వారు పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడాల్సి ఉంటుంది. అయితే రాజ్యసభ సభ్యులు [more]

Update: 2021-05-10 14:30 GMT

రాజ్యసభ పదవి అనేది అందరికీ దక్కదు. ఆ అరుదైన అవకాశం కొందరికే దక్కుతుంది. అలాంటి వారు పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడాల్సి ఉంటుంది. అయితే రాజ్యసభ సభ్యులు ప్రజల్లో ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రజాప్రతినిధులతోనూ వారికి పెద్దగా అవసరం ఉండదు. అందుకే పార్టీని గురించి పట్టించుకోరు. తమకు చేతనైంత ఆర్థిక సాయం మాత్రమే చేస్తారు. ఏ పార్టీలోనైనా కొందరు రాజ్యసభ సభ్యులు మాత్రమే యాక్టివ్ గా ఉంటారు.

ఆరుగురు సభ్యులున్నా….

వైసీీపీ విషయానికి తీసుకుంటే ప్రస్తుతం రాజ్యసభ లో ఆరుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వీరిలో విజయసాయిరెడ్డి ఒక్కరే రాజకీయంగా యాక్టివ్ గా ఉంటారు. రాజ్యసభ లోనూ వీరి పాత్ర పెద్దగా కన్పించదు. వైసీపీికి విజయసాయరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వానిలు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరిలో మోపిదేవి, పిల్లి కిందిస్థాయి రాజకీయాల నుంచి వచ్చిన వారే.

వేమిరెడ్డి పార్టీ కోసం….

వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రచారం చేశారు. పరిమళ్ నత్వాని ఇక మన రాష్ట్రానికి చెందిన వారు కాకపోవడంతో ఆయన గురించి చర్చ అనవసరం. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజాసేవ చేస్తూ రాజ్యసభ లోకి అడుగుపెట్టారు. ఆయన పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించడం, ఎన్నికల్లో ఆర్థిక సాయం అందించడమే పనిగా పెట్టుకున్నారు. ఇక రోజు వారీ రాజకీయాల జోలికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రారు.

ఈయన మాత్రం….?

మరో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి మాత్రం అన్నింటికి దూరంగా ఉంటున్నారు. ఆయన రాజ్యసభ పదవి పొంది దాదాపు ఏడాది కావస్తుంది. అయినా పార్టీ కార్యాక్రమాల్లో పెద్దగా పాల్గొనింది లేదు. తన వ్యాపారాలకే అయోధ్య రామిరెడ్డి పరిమితమయ్యారు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అయోధ్య రామిరెడ్డి పట్టించుకోకపోవడం పట్ల గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలే తప్పుపడుతున్నారు. మొత్తం మీద అయోధ్య రామిరెడ్డికి పదవి ఇచ్చిన కారణం వేరే అయి ఉండవచ్చు కాని ఆయన వల్ల పార్టీకి ఏం ఉపయోగం అన్న ప్రశ్న మాత్రం పార్టీ నేతల నుంచే వస్తుండటం విశేషం

Tags:    

Similar News