ఒక్క పిలుపు… దేశం మొత్తం కదిలింది

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై యావత్ భారత దేశం యుద్ధం మొదలు పెట్టింది. దేశంలో కరోనా వైరస్ విదేశాలనుంచి వచ్చేవారికి సోకి విస్తరిస్తున్న దశలో ప్రధాని నరేంద్ర మోడీ [more]

Update: 2020-03-22 16:30 GMT

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై యావత్ భారత దేశం యుద్ధం మొదలు పెట్టింది. దేశంలో కరోనా వైరస్ విదేశాలనుంచి వచ్చేవారికి సోకి విస్తరిస్తున్న దశలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు కి ప్రజలు స్వాగతించారు. నిత్యావసరాలు పాలు, పెరుగు వంటివి ముందే నిల్వ చేసుకుని ఇంటినుంచి బయటకు రాకుండా స్వీయ నియంత్రణకు సిద్ధం అయ్యారు. జనతా కర్ఫ్యూ పేరిట ప్రధాని పిలుపు ఇవ్వడం దీనికి అన్ని రాష్ట్రాలు సంసిద్ధం అయ్యి ప్రజల్లో చైతన్యం నింపడంతో ఎక్కడికక్కడ స్వచ్ఛంద బంద్ ను అంతా పాటించారు. దేశ చరిత్రలోనే ఈ ఘట్టం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

రైళ్ళు, బస్సులు బంద్ …

ఆదివారం అంటే అందరికి ఆటవిడుపు. కుటుంబసభ్యులతో బంధు మిత్రులతో హోటల్స్, పార్క్ లు సినిమాలు షికార్లు రొటీన్ గా అంతా ఎంజాయ్ చేసే రోజు. అలాంటిది ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రక్కసి ని సంఘటితంగా ఎదిరించేందుకు ఆదివారపు జాయ్ కి అంతా గుడ్ బై కొట్టేశారు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ని పూర్తిగా అమలు చేశారు. దేశం అంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ చేపడితే తెలంగాణ లో మాత్రం 24 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగించి మరింత స్వీయ నియంత్రణ లో ఉండి ఆదర్శంగా నిలిచారు. అంతర్జాతీయ పౌరుల రాకపోకలు అధికంగా ఉన్న హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా వుంది. దాంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కఠిన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ఎపి సర్కార్ సైతం కరోనా వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు మొదలు పెట్టింది. విదేశాలనుంచి వచ్చి వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్న వారిని గుర్తించి చికిత్సకు తరలించే పనిలో యంత్రాంగాన్ని నిమగ్నం చేసింది.

మరిన్ని కర్ఫ్యూలకు …

దేశవ్యాప్తంగా కరోనా వేగంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 300 లకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. విదేశాలనుంచి వచ్చిన వారు ఈ వ్యాధిబారిన ఎక్కువ గా పడుతున్నప్పటికీ వారివల్ల భారతీయులకు వ్యాధి సోకుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. గత నెలరోజులుగా విదేశాలనుంచి భారత్ వచ్చిన వారి వివరాలపై ప్రభుత్వ యంత్రాంగాలు ప్రజలు సైతం దృష్టి పెట్టి సమాచారం అందిస్తున్నారు. తాజాగా దేశంలో అడుగు పెట్టిన వారికి స్వీయ నిర్బంధం 14 రోజులు ఉండేలా సూచించి వారి కదలికలపై ఇళ్లవద్ద నిఘా పెంచారు. కరోనా లక్షాణాలతో బాధపడేవారు కానీ అలాంటివారిని గుర్తించినా వైద్య బృందాలకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుంది. ప్రస్తుతం ఈనెలాఖరువరకు ఆంక్షలు పెట్టినప్పటికీ మరికొన్ని రోజుల పాటు జనతా కర్ఫ్యూ లు మధ్య మధ్యలో పెట్టె అవకాశాలు లేకపోలేదు. దీనికి తొలి అడుగే ఈ ఆదివారం.

Tags:    

Similar News