అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేదెప్పుడు …?

బోరు బావిలో బాలుడు … ఇది భారత్ లో రొటీన్ న్యూస్ గా మారిపోవడం దేశ దురదృష్టమనే చెప్పాలి. తాజాగా తెలంగాణ లోని మెదక్ జిల్లా లో [more]

Update: 2020-05-28 09:30 GMT

బోరు బావిలో బాలుడు … ఇది భారత్ లో రొటీన్ న్యూస్ గా మారిపోవడం దేశ దురదృష్టమనే చెప్పాలి. తాజాగా తెలంగాణ లోని మెదక్ జిల్లా లో జరిగిన సంఘటన మరోసారి దేశవ్యాప్తంగా ప్రజల్లో మరోసారి బాధాకర చర్చకు తెరతీసింది. ప్రభుత్వాలు, కానీ రైతులు కానీ వినియోగించని బోరు బావులను మూయించలేకపోవడం ఫలితంగా చిన్నారుల ప్రాణాలు గోతుల్లో దీపాలుగా అల్లాడుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం చందంగా ఒక సంఘటన తరువాత కొంతకాలం హడావిడి చేసి శాశ్వతంగా దీనికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం కానీ చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. దీనికి దేశంలోని ఏ రాష్ట్రం మినహాయింపు కాకపోవడం గమనార్హం.

టెన్షన్ టెన్షన్ …

తాజాగా తెలంగాణ లో బోరు బావిలో పడ్డ సంజయ్ సాయి వర్ధన్ క్షేమంగా బయటపడాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. బాలుడిని సురక్షితంగా బయట పడేసేందుకు టి సర్కార్ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో అధికారులు ఆపరేషన్ మొదలు పెట్టారు. రెస్క్యూ టీం విజయవాడ నుంచి సహాయకార్యక్రమాలకు బయల్దేరింది. మరోపక్క బాలుడి కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది. బాలుడిని వెలికితీసేందుకు సమాంతరంగా గోతిని తవ్వుతున్నారు. అయితే గోతిలోపడ్డ బాలుడు స్థితిని రిస్క్యూ ఆపరేషన్ టీం పూర్తిస్థాయిలో అంచనా వేయలేకపోతుంది. అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ మొదలు పెట్టినా సర్వత్రా టెన్షన్ కొనసాగుతుంది. కాని బాలుడు చివరకు మృతి చెందాడు. ఇది అత్యంత విషాదకరం

Tags:    

Similar News