జగన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదేనట

ప్రధాని నరేంద్ర మోడీ మరో రికార్డు సొంతం చేసుకోబోతున్నారా అంటే అవును అనే సమాధానం వస్తోంది. విభజన ఏపీకి మూడు రాజధానులు ఉంటే అమరావతి రాజధానికి సరిగ్గా [more]

Update: 2020-08-07 05:00 GMT

ప్రధాని నరేంద్ర మోడీ మరో రికార్డు సొంతం చేసుకోబోతున్నారా అంటే అవును అనే సమాధానం వస్తోంది. విభజన ఏపీకి మూడు రాజధానులు ఉంటే అమరావతి రాజధానికి సరిగ్గా అయిదేళ్ల క్రితం ప్రధాని హోదాలో మోడీ శంకుస్థాపన చెశారు. అదిపుడు శాసన రాజధానిగా ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీని అహ్వానించి అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమం జరిపించారు. ఇక ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం వింత విడ్డూరం అనుకుంటే అదిపుడు సాకారమయ్యే విధంగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాజ్యాంగపరమైన అవరోధాలు అన్నీ కూడా ఇపుడు తొలగిపోయాయి. న్యాయ అడ్డంకులు కూడా తొందరలోనే పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ విజయదశమి ముహూర్తాన పూర్తి స్థాయిలో విశాఖ రాజధాని ఏర్పడుతుందని అంటున్నారు.

మోడీయే అతిధిగా …..

ఈసారి కూడా మోడీ ముఖ్య అతిధిగా ఉంటారని వైసీపీ వర్గాల సమాచారం. విజయదశమి నాటికి పూర్తి స్థాయిలో విశాఖకు అని పరిపాలనావిభాగాలు షిఫ్ట్ అవుతాయని అంటున్నారు. అదే సమయంలో ప్రధాని చేతుల మీదుగా కొత్త రాజధాని నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టించాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే భోగాపురం వద్ద గత ప్రభుత్వం సేకరించిన మూడు వేల ఎకరాల స్థలం ఉంది. అందులో నుంచి 2,500 ఎకరాలు మాత్రమే ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఇచ్చారు. దాని వెనక జగన్ మార్క్ వ్యూహం ఉందని అంటున్నారు. ఇపుడు ఆ అయిదు వందల ఎకరాలను తీసుకుని కోర్ క్యాపిటల్ సిటీ నిర్మాణానికి ప్రధాని మోడీ చేత జగన్ శంఖుస్థాపన చేయిస్తారని అంటున్నారు.

పరిమితంగానే….?

ఇక భోగాపురం చుట్టుపక్కల మరో పదిహేను వందల ఎకరాలు సేకరించి మొత్తం రెండు వేల ఎకరాల్లో విశాఖ క్యాపిటల్ సిటీని నిర్మించాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. భోగాపురం చుట్టూ అధ్బుతమైన కాన్సెప్ట్ సిటీని కూడా నిర్మించాలన్నది జగన్ తపనగా చెబుతున్నారు. భోగాపురం ఇటు విజయనగరం, అటు శ్రీకాకుళానికి కూడా అందుబాటులో ఉంటుంది. విశాఖకు ఎటూ దగ్గరలో ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి మెట్రో రైల్ ని విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా కనెక్టివిటీ ఇస్తూ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. అంటే అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ రాజధాని అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు. ఇక పాలనారాజ‌ధాని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి సమీపంలో ఉండడం ద్వారా సీఎం మంత్రుల టూర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు.

మోడీ వస్తే…?

నిజానికి మోడీ అమరావతి శంఖుస్థాపన తరువాత ఏపీ రాజధాని గురించి పెద్దగా దృష్టి పెట్టలేదు అంటారు. దానికి కారణం చంద్రబాబు అని కూడా చెబుతారు. తనను ఆహ్వానించిన చంద్రబాబు ఆ తరువాత కనీసంగా సంప్రదించకుండా సింగపూరు వంటి విదేశీ సంస్థలతో చర్చలు జరపడం అంతా తన సొంతం అయినట్లుగా చేసుకుపోవడం వల్ల మోడీ దూరంగా ఉండిపోయారని అంటారు. ఇపుడు జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ వెనక బీజేపీ ఉందని ప్రచారంలో ఉంది. మోడీ కనుక విశాఖ రాజధాని శంఖుస్థాపనకు వస్తే మాత్రం చంద్రబాబు అండ్ కోకు గట్టి ఝలక్ ఇచ్చినట్లు అవుతుంది. అంతే కాదు, జగన్ వెనక మోడీ ఉన్నట్లుగా కూడా క్లారిటీ వస్తుంది. మరి మోడీ కానీ, బీజేపీ కానీ తెర ముందుకు వచ్చి అలా దొరికేస్తారా అన్నది కూడా చర్చగానే ఉంది. అయితే వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రధాని మోడీని పిలిచి ఆయన చేతుల మీదుగానే విశాఖ రాజధానికి శ్రీకారం చుడతామని అంటున్నారు. నిజంగా మోడీ వస్తే అది రికార్డే అవుతుంది. ఏపీలోని రెండు రాజధానులకు కొబ్బరికాయ కొట్టిన ప్రధానిగా చరిత్రలో ఆయన మిగిలిపోతారు.

Tags:    

Similar News