అఖిలేష్ ఆగ్రహానికి కారణం అదేనట

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా సమాజ్ వాదీ పార్టీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలని [more]

Update: 2020-03-12 18:29 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా సమాజ్ వాదీ పార్టీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ఇప్పటి నుంచే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్రను ప్రారంభించాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు.

కుటుంబంలో విభేదాలను….

అయితే ఇదే సమయంలో కుటుంబంలో విభేదాలను కూడా పరిష్కరించడానికి ములాయం సింగ్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీలో గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నాు. ప్రగతి శీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా పార్టీ పేరుతో ఎన్నికల బరిలోకి దిగినా ఆయన పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.

ములాయం మధ్యవర్తిత్వం…..

దీంతో ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్ తో చర్చలు జరిపారు. పార్టీని సమాజ్ వాదీలో విలీనం చేయమని కోరారు. అయితే శివపాల్ యాదవ్ మాత్రం విలీనానికి అంగీకరించలేదు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అంగీకరించారు. తాము తమ పార్టీ గుర్తులపైనే పోటీ చేస్తామని, సీట్ల సర్దుబాటు చేసుకుందామని చెప్పారు. పార్టీని విలీనం చేసే ప్రసక్తి లేదని తెలిపారు.

నో అంటున్న అఖిలేష్…..

కానీ ఈ ప్రతిపాదనకు అఖిలేష్ యాదవ్ అంగీకరించడం లేదు. అసలు ఆ పార్టీతో పొత్తుకాని, విలీనం కానీ ప్రస్తావనే లేదని అఖిలేష్ యాదవ్ తెగేసి చెప్పారు. శివపాల్ తో పొత్తు ఎప్పటికైనా ప్రమాదకరమని అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ తో అన్నట్లు తెలుస్తోంది. కానీ ములాయం సింగ్ మాత్రం పొత్తు పెట్టుకోవాలని, లేకుంటే ఓట్లు చీలి ఇబ్బంది ఎదురవుతుందని అఖిలేష్ కు నచ్చ చెబుతున్నారు. మరి ఎన్నికల నాటికి సోదరుడు, కుమారుల మద్య సయోధ్య ములాయం సింగ్ కుదురుస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News