Akhilesh yadav : అఖిలేష్ తన అలవాటును మార్చుకోరట

రాజకీయాల్లో నాయకుడు ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేస్తేనే నేతల్లోనూ, క్యాడర్ లోనూ ధైర్యం ఉంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన నేత పోటీ చేయకపోవడం ఇప్పుడు యూపీ రాజకీయాల్లో [more]

Update: 2021-11-05 16:30 GMT

రాజకీయాల్లో నాయకుడు ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేస్తేనే నేతల్లోనూ, క్యాడర్ లోనూ ధైర్యం ఉంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన నేత పోటీ చేయకపోవడం ఇప్పుడు యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అఖిలేష్ యాదవ్ ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం చర్చనీయాంశమైంది. అఖిలేష్ యాదవ్ కు ఇది అలవాటే. గతంలోనూ ఆయన శాసనసభ ఎన్నికలకు పోటీ చేయలేదు.

ప్రత్యక్ష ఎన్నికల్లో….

ఇలా ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కొత్తేమీ కాదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సయితం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయరు. ఆయన మండలి నుంచి ఎన్నికై ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారు. అఖిలేష్ యాదవ్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. 2012, 2017లో జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలోనూ ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేశారు.

చిన్న వయసులోనే…

అఖిలేష్ యాదవ్ అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి ములాయం సింగ్ స్థాపించిన పార్టీని ఆయన తన చేతుల్లోకి తీసుకుని 2012లో అధికారంలోకి తీసుకుని రాగలిగారు. 27వ ఏటనే ఆయన ఎంపీగా ఎన్నికై అప్పట్లో రికార్డు సృష్టించారు. ఆయన పోటీ చేయదలచుకుంటే అనేక నియోజకవర్గాలు సమాజ్ వాదీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. వాటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే వీలుంది.

భయపడి కాదట….

కానీ ప్రత్యక్ష ఎన్నికలకు భయపడి ఆయన పోటీ చేయకుండా ఉండటం లేదు. 403 స్థానాలున్న యూపీలో 2012లో 224 స్థానాలను సాధించిన అఖిలేష్ యాదవ్ 2017 నాటికి ఆ సంఖ్య 54కే పడిపోయింది. ఈసారి తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉన్నందున పోటీకి దూరంగా ఉండాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకున్నారు. మొత్తం మీద అఖిలేష్ యాదవ్ తన అలవాటును మాత్రం మార్చుకోలేదు.

Tags:    

Similar News