అఖిలేష్ గేమ్ ప్లాన్ ఏంటో?

ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖలేష్ యాదవ్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈసారి విజయం తనదేనన్న ధీమాతో అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అయితే [more]

Update: 2020-11-17 18:29 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖలేష్ యాదవ్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈసారి విజయం తనదేనన్న ధీమాతో అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అయితే అఖిలేష్ యాదవ్ ఎలాంటి గేమ్ ప్లాన్ తో ఎన్నికలకు వెళుతున్నారన్నది పార్టీలోనే చర్చనీయాంశమైంంది. వరస ఓటములు ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయని తెలిసినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు.

మరో రెండేళ్లలో….

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగనున్నాయి. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఇప్పటికే బలంగా ఉంది. అయితే అఖిలేష్ యాదవ్ మాత్రం ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసిన అఖిలేష్ యాదవ్ ఫలితాలు కలసి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు.

పొత్తు పెట్టుకున్నా విఫలమయి….

ఇక 2019 పార్లమెంటు ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీతో కలసి నడిచారు. 2018 లో జరిగిన పార్లమెంటు స్థానాల ఉప ఎన్నికల్లో కలసి పోటీ చేయడంతో గెలిచారు. అందుకే 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఫలితం లేదు. దీంతో బీఎస్పీని కూడా పక్కన పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలన్న అఖిలేష్ నిర్ణయానికి పార్టీ సీనియర్లు సయితం ఆమోదముద్ర వేశారు.

బలం పుంజుకుంటున్న……

మరోవైపు కాంగ్రెస్ ప్రియాంక గాంధీకి యూపీ నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు బీఎస్పీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. మరి అందరినీ దూరం చేసుకుని అఖిలేష్ యాదవ్ ఏం చేయనున్నారన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది అధికార పార్టీకి లాభమన్న అంశాన్ని అఖిలేష్ యాదవ్ పక్కన పెట్టారా? అన్న సందేహం కూడా తలెత్తుతోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గేమ్ ప్లాన్ ఏంటో అర్థం కాక ఆయన పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు.

Tags:    

Similar News