లీడర్ గా కాదట…డాటర్ గానేనట..!!

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు తత్వం బోధపడినట్లుంది. ఒకవైపు తనవాళ్లే పార్టీని వీడుతుండటంతో అఖిలప్రియ తన ప్రాధాన్యత నియోజకవర్గంలో ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన [more]

Update: 2019-08-02 08:00 GMT

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు తత్వం బోధపడినట్లుంది. ఒకవైపు తనవాళ్లే పార్టీని వీడుతుండటంతో అఖిలప్రియ తన ప్రాధాన్యత నియోజకవర్గంలో ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కొన్నాళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అలాగే తన సోదరుడు భూమా కిషోర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆళ్లగడ్డలో భూమా కుటుంబం నిట్టనిలువునా చీలిందన్న వార్తలతో అఖిలప్రియ తిరిగి ప్రజలతో మమేకమయ్యే పనిలో పడ్డారు.

కుటుంబంలోనే శత్రువులు….

భూమా అఖిలప్రియకు ప్రజల్లో కంటే సొంత పార్టీలోనూ, కుటుంబంలోనే శత్రువులు ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఎందుకంటే అఖిలప్రియ ఓటమికి సొంత మనుషులే ఈ ఎన్నికలలో పనిచేశారన్నది ఆమె అనుమానం. అందుకే అఖిలప్రియ ఒక్కొక్కరిగా దూరం చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖిలప్రియ సోదరి, సోదరుడు, భర్త మినహా ఆమెకు సహకారం ఆ కుటుంబం నుంచి అందింది లేదని అఖిలప్రియ బహిరంగంగా అంగీకరిస్తున్నారు.

దూరం చేసుకున్నారని…..

అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, మంత్రిగా ఉండి కూడా ముఖ్యులను, భూమా నాగిరెడ్డి సన్నిహితులను దూరం చేసుకున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. అయితే ఇందుకు భూమా అఖిలప్రియ చెప్పే కారణాలు కూడా ఉన్నాయి. తన తండ్రి ఆకస్మికంగా మరణించిన తర్వాత ఆయన నమ్మకంగా బినామీ ఆస్తులు ఉంచితే వాటిని కూడా తమకు ఇవ్వలేదన్నది ఆమె ఆగ్రహం. భూమా నాగిరెడ్డి నమ్మిన వాళ్లే తమ కుటుంబాన్ని మోసం చేశారని అఖిలప్రియ తొలి నుంచి చెబుతున్న మాట.

అందుకే వారిని…..

అందుకే అఖిలప్రియ తన తండ్రి వల్ల లబ్ది పొంది ఆయన మరణం తర్వాత అడ్డం తిరిగిన వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. అఖిలప్రియ ఈ విషయంలో రాజకీయ నేతగా కాకుండా ఒక తండ్రికి కూతురిగా వ్యవహరించారన్నది కుటుంబ సభ్యులు చెబుతున్న మాట. ఇలా అఖిలప్రియ అందరినీ దూరం చేసుకున్నా ఒంటరిగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. పైగా భూమా వారసుడు తన సోదరుడు విఖ్యాత్ రెడ్డి అని ఆమె ప్రకటించడం విశేషం. రెండు రోజుల క్రితం ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తాను కార్యకర్తలకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మీద అఖిలప్రియ ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత నిరాశ చెందినా తిరిగి యాక్టివ్ కావడం ఆ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది.

Tags:    

Similar News