అందుకేనా అఖిల మౌనం…. వెనుక చాలానే జ‌రిగిందా…?

లేస్తే.. మ‌నిషిని కాను.. అన్న రేంజ్‌లో రెచ్చిపోయిన మాజీ మంత్రి అఖిల ప్రియ ఇప్పుడు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా జ‌గ‌న్ ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత భారీ [more]

Update: 2020-08-31 03:30 GMT

లేస్తే.. మ‌నిషిని కాను.. అన్న రేంజ్‌లో రెచ్చిపోయిన మాజీ మంత్రి అఖిల ప్రియ ఇప్పుడు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా జ‌గ‌న్ ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత భారీ రేంజ్‌లో స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు అఖిల ప్రియ‌. త‌న తండ్రి భూమా నాగిరెడ్డిని మించిన రాజకీయాలు చేయాల‌ని అనుకున్నారో.. ఏమో తెలియ‌దు కానీ.. జ‌గ‌న్‌ను ఏకేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. నిత్యం జిల్లాలోని త‌న రెండు నియోజ‌క‌వ‌ర్గాలు అంటూ ఆళ్లగ‌డ్డ నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరిగేవారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కూడా ఐదారు నెల‌లు జ‌గ‌న్‌, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శలు చేశారు. త‌ర్వాత ఆమె ఒక్కసారిగా స్లో అవ‌డంతో వైసీపీలోకి వెళ‌తార‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అయితే ఆమె వెంట‌నే ఖండించారు.

హత్య కుట్రకేసులు నమోదు కావడంతో…

ఈ లోగా భ‌ర్తపై కేసులు న‌మోదు కావ‌డంతో వాటిని ఎదుర్కొనేందుకు తాను ఎంత‌కైనా రెడీ అని ప్రభుత్వానికి ఘాటు సంకేతాలు పంపారు. అప్పటి నుంచి ఆమె ప్రభుత్వంపై తీవ్రంగా విమ‌ర్శలు గుప్పించేవారు. అన్న క్యాంటీన్ల నుంచి అనేక అంశాల‌పై చంద్రబాబు పిలుపు మేర‌కు అనేక నిర‌స‌న‌ల్లోనూ పాల్గొన్నారు. ఇక‌, సొంత పార్టీ టీడీపీలోనూ ఎవ‌రితోనూ ప‌డ‌క‌పోయినా.. త‌న మానాన త‌ను రాజ‌కీయాలు చేస్తూ.. ముందుకు సాగారు. అయితే, అనూహ్యంగా ఆమె సైలెంట్ అయ్యారు. ఎక్కడా దాదాపు రెండు మాసాలుగా అఖిల ప్రియ వార్తలు రావ‌డం లేదు. ఆమె మీడియా ముందుకే రావ‌డం మానేశారు. దీంతో అస‌లు ఏమైంది? అఖిల ప్రియ రాజ‌కీయ ఎటైనా మ‌లుపు తిరిగిందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

రెండు కారణాలట….

దీనికి ప్రధానంగా రెండు కార‌ణాలు చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. సొంత పార్టీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డిపై హ‌త్యాయ‌త్నం కేసులో అఖిల ప్రియ భ‌ర్తపై కేసున‌మోదైంది. రెండు.. ఇంత జ‌రుగుతున్నా.. పార్టీ అధినేత చంద్రబాబు చూసీ చూడ‌న‌ట్టు వ్యవ‌హ‌రించారు. దీంతో అఖిల ప్రియ మౌన‌మే మంచిద‌ని భావిస్తున్నార‌ని చెబుతున్నారు. త‌న భ‌ర్తపై కేసు న‌మోదైన నేప‌థ్యంలో అధికార పార్టీపై విమ‌ర్శలు చేస్తే.. ఇది మ‌రింత‌గా త‌న కుటుంబానికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని తెస్తుంద‌ని.. అందుకే అఖిల ప్రియ సైలెంట్ అయ్యార‌ని క‌ర్నూలు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది.

బాబు పట్టించుకోక పోవడంతో…..

మ‌రోప‌క్క, ప్రభుత్వాన్ని ఇంత‌గా టార్గెట్ చేస్తున్నా.. టీడీపీ సీనియ‌ర్లను మించి విమ‌ర్శలు చేస్తున్నా.. త‌న కుటుంబంపై న‌మోదైన కేసు విష‌యంలో బాబు మౌనం పాటించ‌డాన్ని అఖిల ప్రియ జీర్ణించుకోలేక పోతున్నార‌ని అంటున్నారు. ఒక మ‌హిళ‌గా ఉండి క‌ర్నూలు జిల్లాలో సంక్లిష్టమైన ఆళ్లగ‌డ్డ, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల‌ను లాక్కొస్తున్నా పార్టీ అధిష్టానం జేసీ, అచ్చెన్న, కొల్లు ర‌వీంద్రపై కేసులు న‌మోదు అయితే స్పందించి.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం ఆమెను తీవ్రంగా బాధించింద‌ని తెలుస్తోంది. మొత్తానికి అఖిల ప్రియ ఆరు నెల‌ల క్రితం ఎంత దూకుడు చూపించారో.. అంతే సైలెంట్ అయ్యార‌న్నది మాత్రం నిజం.

Tags:    

Similar News