అఖిల భారీ మూల్యం చెల్లించుకోనున్నారా?

భూమా కుటుంబానికి ఆళ్లగడ్డ శాశ్వతంగా దూరం కానుందా? ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టనుందా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. భూమా కుటుంబం ప్రస్తుతం [more]

Update: 2021-01-23 05:00 GMT

భూమా కుటుంబానికి ఆళ్లగడ్డ శాశ్వతంగా దూరం కానుందా? ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టనుందా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. భూమా కుటుంబం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. కోర్టు కేసులు, భూ వివాదాలతో అఖిలప్రియ కేసులను ఎదుర్కొంటున్నారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి జైలు కెళ్లిన అఖిలప్రియపై కనీసం సానుభూతి లేదన్నది వాస్తవం. అఖిలప్రియ కనుసన్నల్లోనే కిడ్నాప్ జరిగిందని తెలియడంతో ఆమెను సన్నిహితులు కూడా దూరం పెడుతున్నారు.

అందరూ దూరమయి….

నిజానికి అఖిలప్రియకు పెళ్లైన తర్వాత నుంచి భూమా దగ్గర బంధువులే దూరమయ్యారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ జోక్యం ఎక్కువగా ఉండటం, ఆయన భూమా వర్గాన్ని పట్టించుకోక పోవడం వల్లనే భూమాకు అత్యంత సన్నిహితులు కూడా దూరమయ్యారు. అందుకే గత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ దారుణ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. తల్లిదండ్రులు లేని పిల్లలన్న సానుభూతి కూడా పనిచేయలేదు.

దూరం పెట్టేందుకు…..

ఇక కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న అఖిలప్రియను టీడీపీ కూడా దూరం పెట్టేందుకు సిద్ధమవుతుందని సమాచారం. అఖిలప్రియ వల్ల పార్టీకి చెడ్డపేరు తప్పించి ప్రయోజనం ఏదీ లేదని తెలిసింది. అఖిలప్రియ అరెస్ట్ అయిన తర్వాత కనీసం ఆళ్లగడ్డలో స్పందన లేకపోవడాన్ని కూడా టీడీపీ అధిష్టానం గమనించింది. అందుకే అఖిలప్రియ కంటే ఆమె సోదరి మౌనిక బెటర్ అని పార్టీ నాయకత్వం భావిస్తుందని సమాచారం. అయితే మౌనిక తన అక్క అఖిలప్రియను కాదని రాజకీయ బాధ్యతలను చేపట్టే అవకాశం లేదు.

ఏవీకి అవకాశం ఇస్తారా?

మరోవైపు భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి పేరు కూడా ప్రముఖంగా పార్టీలో విన్పిస్తుంది. గత ఎన్నికల సమయంలోనే ఆయన ఆళ్లగడ్డ టిక్కెట్ ను ఆశించారు. ఏవీ సుబ్బారెడ్డికి, అఖిలప్రియకు మధ్య దూరం బాగా పెరిగింది. దీంతో భూమా కుటుంబాన్ని పక్కన పెట్టి భూమాకు అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డికి ప్రయారిటీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం మీద టీడీపీ అధిష్టానం ఆళ్లగడ్డ విష‍యంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News