హీరో మళ్ళీ వచ్చేసాడు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఫుల్ జోష్ గా ఉంది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ రీ ఎంట్రీ దీనికి రీజన్. అమెరికా అభేద్యంగా చెప్పుకునే ఎఫ్ [more]

Update: 2019-09-03 03:30 GMT

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఫుల్ జోష్ గా ఉంది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ రీ ఎంట్రీ దీనికి రీజన్. అమెరికా అభేద్యంగా చెప్పుకునే ఎఫ్ 16 పాక్ యుద్ధవిమానాన్ని నేలకూల్చి పాక్ భూభాగంలో చిక్కి ప్రాణాలతో తిరిగి వచ్చాడు మిగ్ 21 వింగ్ కమాండర్ అభినందన్. పాకిస్థాన్ సైన్యం ఇంటరాగేషన్ ను ధైర్యంగా ఎదుర్కొని దేశవాసుల్లో హీరోగా ఎఫ్ 16 ను నేలకూల్చి ప్రపంచవాసులందరిని ఆశ్చర్యపరిచాడు అభినందన్. పుల్వామా దాడి తరువాత భారత భూభాగంలోకి ఎఫ్ 16 తో ఎంటర్ అవ్వాలని తహతహలాడిన పాకిస్తాన్ ప్రయత్నాన్ని అత్యంత పాత మిగ్ 21 తో అసమాన ధైర్యసాహసాలతో ఎదుర్కొన్న ధీరుడు అభినందన్. ఫైటర్ నేలకూలే సమయంలో అందులోనుంచి ఎగ్జిట్ అయిన అభినందన్ సరిహద్దులో పాక్ సైనికులకు దొరికిపోయారు.

టార్చర్ పెట్టినా లొంగలేదు ….

అభినందన్ ను తీవ్రంగా హింసించినా ప్రాణాలకు తెగించి మరీ ఆ దేశ ఆర్మీ విచారణను ఎదుర్కొన్నారు. ఈలోగా పాక్ తో భారత్ కి సైనికుల అప్పగింత ఒప్పందం నేపథ్యంలో అంతర్జాతీయ వత్తిడితో అభినందన్ రెండు రోజుల్లో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఆ తరువాత వివిధ పరీక్షలను అభినందన్ ఎయిర్ ఫోర్స్ నిబంధనల ప్రకారం ఎదుర్కొన్నారు. అవి పూర్తి అయ్యాక కాశ్మీర్ లోని తన రేజ్జెంట్ లోనే మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నారు. దేశం మెచ్చిన అభినందన్ ధైర్య సాహసాలు మెచ్చి కేంద్ర ప్రభుత్వం వీరచక్ర తో ఘనంగా సత్కరించింది.

ఎయిర్ చీఫ్ మార్షల్ తో కలిసి …

ఆరునెలల స్వల్ప విరామం తరువాత తన ఫేవరెట్ మిగ్ 21 జెట్ లో అడుగుపెట్టి గాల్లోకి ఎగిరాడు అభినందన్ వర్ధమాన్. ఆయనతో బాటు ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా పాల్గొనడం విశేషం. గాల్లో 30 నిమిషాలు విహరించిన వీరిద్దరూ ఎయిర్ బేస్ చేరుకున్నాక తమ ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా ఎయిర్ చీఫ్ మార్షల్ తాను అభినందన్ తండ్రి తో పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు తామిద్దరూ ఫ్లైట్ జెట్స్ నుంచి ఎగ్జిట్ అయినవారిమే అని అదీ పాకిస్తాన్ తో తలపడిన సమయంలో కావడంతో చాలా పోలికలు వున్నాయంటూ చమత్కరించారు. తాను ఎగ్జిట్ అయ్యాక తిరిగి విధుల్లో చేరడానికి 9 నెలలు సమయం పడితే అదే అభినందన్ ఆరునెలల్లో దేశానికి సేవ చేయడానికి ముందుకు రావడం అభినందనీయం.

Tags:    

Similar News